Dasara : సినిమాకు నాని, కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

- Advertisement -

Dasara న్యాచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం దసరా.. భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు ఒక వైపు మిశ్రమ టాక్ ను అందుకున్నా కూడా మరోవైపు కలెక్షన్లతో దూసుకుపోతుంది.. గతంలో వచ్చిన సినిమాలు అన్నీ కూడా లవ్ అండ్ ఫ్యామిలి ఎంటర్టైనర్ గా వచ్చినవే.. ఆ సినిమాలకు భిన్నంగా మాస్, యాక్షన్ కథతో ఈ సినిమాను తెరకేక్కించారు.. ఈ సినిమాలో నాని ఊర మాస్ లెవల్లో నటించిన ‘దసరా’ మూవీ శ్రీరామనవవి సందర్భంగా థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమా గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నాని ఈ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నాడన్న చర్చ తీవ్రమైంది. ఈ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘అంటే సుందరానికి..’. ఇందులో నటించినందుకు రూ.12 కోట్లు తీసుకున్నాడని టాక్.. ఇక ఈ సినిమాకు అంతకు మించి రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతుంది..

Dasara
Dasara

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ‘దసరా’ మూవీ మార్చి 30న థియేటర్లోకి వచ్చింది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమాతోనే ఆయన ఇండస్ట్రీ వ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కాడు. ఎందుకంటే సినిమాకు హైప్ తీసుకురావడంలో శ్రీకాంత్ తీవ్రంగా కృషి చేశాడని తెలుస్తోంది. ‘దసరా’కు సంబంధించిన ఫస్ట్ లుక్ తోనే సినిమాపై అంచనాలు పెరిగాయి..అప్పటి నుంచి ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.. ఈరోజు థియేటర్ల లోకి వచ్చిన ఈ సినిమా వచ్చింది..

సంతోష్ నారాయన్ మ్యూజిక్ డైరెక్షన్లో కాసర్ల శ్యామ్ రచించిన పాటలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ దుమ్ములేపుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఆయా లాంగ్వేజెస్ లో సాంగ్స్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మిగతా ఇండస్ట్రీల్లోనూ అంచనాలు పెరిగాయి..ఇప్పటి వరకు లవ్ హీరోగా అందరినీ ఆకట్టుకున్న నాని మాస్ హీరోగా కూడా మెప్పించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇందుకోసం నాని భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ .ఇప్పటి వరకు ఆయన రెమ్యూనరేషన్ రూ.12 కోట్లు కాగా.. ‘దసరా‘ సినిమా కోసం ఆయన రూ.15 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ కీర్తి సురేష్ రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here