Anchor Suma : యాంకర్ సుమ పై టీవీ ప్రేక్షకులు ఫైర్..అక్కడ కావాలంటూ..

- Advertisement -

Anchor Suma : బుల్లి తెర లెజండరి యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కేరళ అమ్మాయి అయిన సుమ గత ఇరవై ఏళ్ల నుంచి తెలుగు యాంకర్ గా చేస్తుంది.. ఎన్నో షో లతో బుల్లి తెర ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ను అందించిన విషయం తెలిసిందే.. స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు అందరూ హీరోల సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్స్ ని సుమ సక్సెస్ చేయడంలో కీలక పాత్ర వహిస్తారు.

సుమ యాంకర్ గా షో చేస్తుంది.. అంటే ఆ షో కానీ కార్యక్రమం కానీ సూపర్ హిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తున్న క్యాష్ కార్యక్రమం ఎంతటి సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమె నుండి అంతా కూడా ఒక టాక్ షో ని ఆశిస్తున్నారు..అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎంతో మంది సినితారలతో షో లను చేసింది.. అయితే సుమ నుంచి ఇంకా కావాలంటూ ఆమె ఫ్యాన్స్ ఆమెను టాక్ షో లలో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Anchor suma
Anchor suma

ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా టాక్‌ షో ముగిసిన విషయం తెలిసిందే. చివరి ఎపిసోడ్ లో ఆలీని సుమ ఇంటర్వ్యూ చేసింది. ఆ సందర్భంగా సుమ అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకే సుమ నుండి టాక్ షో కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆలీతో సరదాగా కి బదులుగా సుమ తో సరదాగా అనే టాక్‌ షో వస్తే బాగుంటుందని ఆమె అభిమానులతో పాటు ప్రేక్షకులు ఆశిస్తున్నారు. సుమ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ గ్యాప్ లేకుండా బిజిగా ఉంది..

- Advertisement -
Alitho Saradaga

ఆమెను టాక్‌ షో చేసేందుకు తీసుకొస్తే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీలో కాకుండా మరేదైనా షోలో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమాల యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ నుంచి ఇతర కార్యక్రమాలకు సుమ ఎలాగూ యాంకర్ గా వ్యవహరిస్తుంది. అదే సమయంలో ఒక టాక్ షో కి యాంకర్ కి వ్యవహరిస్తే ఆమె స్థాయి మరింతగా పెరుగుతుందని అభిమానులతో పాటు బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..మరి సుమ మనసులో ఏముందో.. తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..ప్రస్తుతం క్యాష్ షో లో మాత్రమే సుమ కనిపిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here