Pushpa 2 : పుష్ప 2 నుంచి రష్మిక అవుట్..రిస్క్ చేస్తున్న సుక్కు..

- Advertisement -

Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపిందిన భారీ యాక్షన్ సినిమా పుష్ప..గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది..ఈ సినిమా కు సీక్వెల్ గా ఇప్పుడు పార్ట్ 2 రానుంది..పుష్ప మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో పుష్ప 2 సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు.పుష్ప పార్ట్ 1 కథలో కొన్ని రకాల యూనిక్ అంశాలు యాడ్ చేశారు. అలా రెండవ భాగంలో అదనపు కొత్త పాత్రలు యాడ్ అవుతున్నాయి.

Pushpa 2
Pushpa 2

పుష్ప లో ఉన్న పాత్రలు పుష్ప 2 లో కనిపించనున్నాయి. కనిపించే ప్రతి పాత్రకి అంతే ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలో మరో హీరోయిన్ సాయి పల్లవి ని తీసుకుంటున్నట్లు సినిమా స్టేట్స్ మీదకి వెళ్ళకముందే వార్తలు వచ్చాయి.స్క్రిప్ట్ రెండవ హీరోయిన్ పాత్రను డిమాండ్ చేయడంతో సుకుమార్ సాయి పల్లవి తీసుకుంటున్నట్లు న్యూస్ బయటకు వచ్చింది. అయితే సాయి పల్లవి నటిస్తుందా లేదా అనే విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త పాత్ర తెరపైకి వస్తుంది. ఇందులో ఓ గిరిజన యువతి పాత్ర కీలకంగా ఉంటుంది.

Allu Arjun Pushpa 2 Movie
Allu Arjun Pushpa 2 Movie

అయితే ఆ పాత్రకి ఐశ్వర్య రాజేష్ అయితే సెట్ అవుతుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. ఇలాంటి పాత్ర అయితే ఐశ్వర్య రాజేష్ కు బాగా సెట్ అవుతుంది.చక్కని ఆహార్యం తో అన్ని పక్కగా సూట్ అవుతాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. ఇక్కడే మరొక డౌట్ వస్తుంది. ఇలాంటి కొత్త పాత్ర ఎంట్రీ నేపథ్యంలో ఒక డౌట్ వినిపిస్తుంది. సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నది సెకండ్ హీరోయిన్ గా లేదా మెయిన్ హీరోయిన్ గానా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. రష్మిక కన్నా కూడా సాయి పల్లవి కరెక్ట్గా సెట్ అవుతుందనే వాదన వినిపిస్తోంది..

- Advertisement -

సాయి పల్లవికి క్యారెక్టర్ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేస్తుంది. అది చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని పట్టించుకోదు. నటనకు ఆస్కారం ఉన్న ఎటువంటి పాత్రలోనైనా నటిస్తుంది. ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.. ఆ సినిమాలో కూడా పార్ట్ వన్ లో ఉన్న వారంతా మళ్ళీ రీపిట్ అవుతున్నారు..ఈసారి ప్రతి క్యారెక్టర్ కు న్యాయం చేస్తానని ఆ మధ్య డైరెక్టర్ సుక్కు అన్నాడు..సినిమా ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. దాంతో సినిమా కోసం ఫ్యాన్స్‌ వెయిట్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here