Rishab Shetty : రష్మికపై కాంతారా హీరో స్ట్రాంగ్‌ కౌంటర్.. అలాంటి హీరోయిన్లు నచ్చరంటూ..



దేశవ్యాప్తంగా ‘కాంతార’ సినిమాకు వస్తోన్న క్రేజ్‌ ఒక్కసారిగా ఆ మూవీ డైరెక్టర్/హీరో రిషబ్ శెట్టి రేంజ్‌ని పెంచేసింది. ఒక్క సినిమాతో రిషబ్ శెట్టి కూడా పాన్ ఇండియా హీరోయే కాదు డైరెక్టర్ కూడా అయిపోయాడు. ఇక ప్రముఖ టీవీ ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెల్స్ రిషబ్ ఇంటర్వ్యూల కోసం వరుసకట్టాయి. కేవలం టాలీవుడ్, శాండల్‌వుడే కాదు.. బాలీవుడ్ కూడా Rishab Shetty ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టింది. ఈ క్రమంలోనే ఓ బీటౌన్ ఛానల్‌కు కాంతార హీరో ఇంటర్వ్యూ ఇచ్చాడు.

Rishab Shetty / Rashmika Mandanna
Rishab Shetty / Rashmika Mandanna

ఈ సందర్భంగా అక్కడి యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఆన్సర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రిషబ్.. నేషనల్ క్రష్ రష్మికనే టార్గెట్ చేసి ఆ వ్యాఖ్యలు చేశాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది. దీనిపై రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అవుతుండగా.. నెటిజన్లు మాత్రం రిషన్ సమాధానానికి ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆ యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటి..? దానికి రిషబ్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసుకుందామా..?

కాంతారా ఫేం రిషబ్ శెట్టి బాలీవుడ్ మీడియాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్.. రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి, సమంతల్లో హీరోయిన్​గా ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్న అడిగారు. దీనికి రిషబ్ శెట్టి సమాధానం ఇస్తూ సాధారణంగా తాను స్క్రిప్ట్ పూర్తయ్యాకనే నటీనటులను ఎంచుకుంటానని, కొత్త వారికి ప్రిఫరెన్స్ ఇస్తానని అన్నారు. అయితే ఆ తర్వాత గాల్లో రెండు చేతులతో కొటేషన్ సింబల్ చూపిస్తూ ఇలాంటి హీరోయిన్లు తనకు నచ్చరని, కానీ సాయిపల్లవి, సమంతలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.

అయితే రిషబ్ కౌంటర్ వేసింది రష్మికకేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రష్మిక ఫ్యాన్సేమో రిషబ్‌పై ఫైర్ అవుతున్నారు. మరోవైపు నెటిజన్లు మాత్రం రిషబ్ సమాధానానికి ఫిదా అవుతున్నారు. గతంలో ఇంటర్వ్యూలో రష్మిక ఇచ్చిన సమాధానానికి రిషబ్ చాలా సైలెంట్‌గా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు. అసలు గతంలో ఇంటర్వ్యూలో రష్మిక ఏం చెప్పిందంటే..?

నేషనల్ క్రష్ రష్మిక ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’లో అవకాశం రావడం వెనకున్న కథ చెప్పారు. ఒక అందాల పోటీలో తాను గెలిచానని, ఆ సమయంలో తన ఫొటో ఒక ప్రముఖ దినపత్రిక మొదటి పేజీలో వచ్చిందని, అప్పుడు తనకు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. ప్రొడక్షన్ హౌస్ గురించి తెలిపే సమయంలో రష్మిక రెండు చేతులతో గాల్లో కొటేషన్ సింబల్ చూపిస్తూ మాట్లాడటంతో అది బాగా వైరల్ అయింది.

అయితే ‘కిరిక్ పార్టీ’ సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకుడు. సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టినే ఆ సినిమాను నిర్మించారు కూడా. రష్మిక చేసిన వ్యాఖ్యలకు రిషబ్ శెట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ‘కిరిక్ పార్టీ’ సినిమాతో రష్మిక సాండల్​వుడ్​లో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడటంతో వారిద్దరికీ నిశ్చితార్థం కూడా అయి పలు కారణాలతో ఆగిపోయింది.