Somy Ali : ‘సల్మాన్ ఖాన్‌ ప్రేమోన్మాది.. సిగరెట్లతో కాల్చేవాడు’.. బాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్



సల్మాన్ ఖాన్.. బాలీవుడ్ భాయ్.. ఈ కండల వీరుడి గురించి ఎవరిని అడిగినా ఎంతో మంచి మనసు కలిగిన వ్యక్తి అని చెబుతుంటారు. కష్టాల్లో ఉన్న వాళ్లని ఆదుకోవడంలో ముందుంటాడు అంటుంటారు. కానీ సల్మాన్ ఖాన్ ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్స్ మాత్రం అతడిని కాస్త నెగిటివ్‌గానే వర్ణిస్తారు. అందరికీ సల్మాన్ మంచి వ్యక్తే కానీ రిలేషన్‌షిప్‌లో మాత్రం ఈ సుల్తాన్ కాస్త పొసెసివ్‌గా ఉంటాడని బీ టౌన్‌లో టాక్. అయితే తాజాగా సల్మాన్ ఖాన్ ఎక్స్ లవర్ ఒకరు ఈ కండల వీరుడిపై సంచలన కామెంట్స్ చేసింది. సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ ( Somy Ali ) సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

Salman Khan Somy Ali
Salman khan and Somy Ali 

సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అతన్ని ఒక లైంగిక ఉన్మాదిగా అభివర్ణించింది. తనను సిగరెట్లతో కాల్చుతూ హింసించాడని ఆరోపించింది. అంతే కాదు అమ్మాయిలను కొట్టడం సల్మాన్‌కు అలవాటంటూ సంచలన ఆరోపణలు చేసింది.

Salman and somi

సోమీ అలీ అంటే ఈ జనరేషన్ యువతకు తెలియదు కానీ.. 90లలో ఆమె చాలా పాపులర్. పాకిస్థాన్‌లో పుట్టిన సోమీ యూఎస్‌లో తన కుటుంబంతో స్థిరపడింది. సల్మాన్ ఖాన్ సినిమాలు చూసి ఫిదా అయిన సోమీ అతడి కోసం ఏకంగా ఇండియాకు వచ్చింది. మోడలింగ్ పట్ల ఆసక్తితో ఆ కెరీర్‌లో ఫేమస్ అయి నెమ్మదిగా బాలీవుడ్ సినిమా ఆఫర్లు అందుకుంది. 1993లో విడుదలైన కృష్ణ అవతార్ మూవీతో సోమీ అలీ హీరోయిన్ అయింది. సల్మాన్ ఖాన్‌ కోసం ఇండియాకు వచ్చిన సోమీ ఎలాగో అలా ఈ కండల వీరుడిని కలిసింది. ఆ పరిచయం ప్రేమగా మారిందని అప్పట్లో టాక్. ఏడేళ్లకు పైగా సల్మాన్-సోమీ అలీ ఎఫైర్ నడిచింది. అప్పట్లో వీరి రిలేషన్ బాలీవుడ్ మీడియాలో సెన్సేషన్. వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ సడెన్‌గా సల్మాన్ సోమీతో బ్రేకప్ చేసుకున్నాడు. ఆమె తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది. సోమీ ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవడానికి కారణం సల్మానేనని ఆరోపణలు ఉన్నాయి.

సల్మాన్‌తో బ్రేకప్ తర్వాత సోమీ అలీ పలు సందర్భాల్లో అతడిపై చాలా విమర్శలు చేసింది. రీసెంట్‌గా కూడా సోమీ సల్మాన్‌పై ఫైర్ అయింది. సల్మాన్ ఓ ఉన్మాది అని.. అమ్మాయిలను కొట్టడం అతడికి అలవాటని.. తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు సిగరెట్‌తో కాల్చి వేధించేవాడని ఆరోపించింది. లైంగిక వేధింపులకు పాల్పడతాడని ఆరోపణలు చేసింది. తనలాగే సల్మాన్ మరికొంత మంది అమ్మాయిలను మోసం చేశాడని సోమీ చెప్పింది.

సల్మాన్ ఇంతకుముందు ఐశ్వర్యా రాయ్‌తో కూడా రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. ఆ సమయంలో ఆమెను కూడా వేధింపులకు గురిచేసినట్లు అప్పట్లో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఏకంగా ఓ సారి తాగిన మైకంలో ఐశ్వర్య అపార్ట్‌మెంట్ ముందు అర్ధరాత్రి అల్లరి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారట.

సోమీ అలీ ప్రస్తుతం మహిళల హక్కుల కోసం పోరాడుతోంది. మహిళలపై వేధింపులకు వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది. ఇక సల్మాన్ విషయానికి వస్తే ఆయనకు అఫైర్లకు కొదువేం లేదు. సంగీత బిజిలానీ, సోమీ అలీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ తో పాటు ఒకరిద్దరు విదేశీ అమ్మాయిలతో ఎఫైర్ నడిపాడు.

Tags: