రామ్ చరణ్​పై స్పైడర్ మ్యాన్ హీరో ప్రశంసలు.. ఆర్ఆర్ఆర్​కు ఫిదా అయ్యానంటూ కామెంట్స్

- Advertisement -

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి గుర్తింపు పొందిందో తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి యావత్ ప్రపంచానికి తెలిసింది. ఇక ఈ సినిమాలోని నాటు నాటు పాట ఎంత క్రేజ్ సంపాదించుకుందో కూడా తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ఇక యూట్యూబ్, టిక్​టాక్, ఇన్​స్టాగ్రామ్ ఎక్కడ చూసిన ఈ పాటపై స్టెప్పులు వేసిన వీడియోలే. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ ఈ పాటకు కాలు కదిపారు. అంతర్జాతీయ వేదికలపై కూడా ఆర్ఆర్ఆర్ ప్రస్తావన తరచూ వచ్చింది. ఇక జేమ్స్ కామెరూన్ వంటి దిగ్గజ దర్శకులు.. దర్శకధీరుడు రాజమౌళి పనితనాన్ని.. క్రియేటివిటీని.. టాలెంట్​ను వేయినోళ్ల పొగిడారు. ఈ సినిమా టాలీవుడ్​ టూ హాలీవుడ్ వయా బాలీవుడ్ తన ప్రస్థానాన్ని విజయవంతంగా సాగించింది.

రామ్ చరణ్​
రామ్ చరణ్​

ఆర్ఆర్ఆర్​ సినిమాతో హిస్టరీ క్రియేట్ చేసిన రాజమౌళి ప్రపంచ దేశాల ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు సాధించడమే కాకుండా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా గురించి.. ఇందులో నటించిన తారక్, రామ్ చరణ్​ల గురించి ఇప్పటికే పలువురు హాలీవుడ్ నిపుణులు మాట్లాడారు. పొగడ్తల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో కొమురంభీంగా నటించిన తారక్​పై ప్రశంసల జల్లు కురిసింది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ‘స్పైడర్‌ మ్యాన్‌’ హీరో టామ్‌ హాలండ్‌ మాట్లాడాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాన్ని ప్రశంసించాడు. ముఖ్యంగా రామ్ చరణ్​పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

tom holland

ఇటీవల ముంబయిలో జరిగిన నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ (NMACC) ప్రారంభోత్సవానికి బాలీవుడ్​తో పాటు హాలీవుడ్ స్టార్లు కూడా అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. జండాయా, గిగి హాడిడ్​లతో పాటు టామ్‌ హాలండ్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. మూడు రోజుల పాటు భారత్‌లోనే ఉన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ భారత్‌ పర్యటన గురించి చెప్పాడు. అందులోనే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి కూడా ప్రస్తావించాడు.

- Advertisement -

‘‘నాకు భారత్‌ పర్యటన ఎన్నో మంచి జ్ఞాపకాలనిచ్చింది. ఆ పర్యటనను జీవితంలో మర్చిపోలేను. మళ్లీ  భారత్‌కు వెళ్లాలనుకుంటున్నాను. మూడు రోజుల్లో ఎంతో మంది ప్రముఖులను కలిశాను. ఒక్క మాటలో చెప్పాలంటే అద్భుతంగా గడిచింది. అలాగే ఈ మధ్యనే నేను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చూశాను. ఆ సినిమా చాలా బాగుంది. నాకెంతో నచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ అదుర్స్’’ అని చెప్పాడు. దీంతో రాజమౌళి అభిమానులు ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తున్నారు. ఈ వీడియో చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్, రాజమౌళి ఫ్యాన్స్ తెగ సంబుర పడిపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here