ముదురు భామతో ఎన్టీఆర్ రొమాన్స్.. ఫ్యాన్స్ పరిస్థితి ఏంటో పాపం!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ #RRR చిత్రం తర్వాత కొరటాల శివ తో ‘దేవర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఈమధ్యనే ప్రారంభమై రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. గత నెల ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసారు. దీనికి ఫ్యాన్స్ నుండి బంపర్ రెస్పాన్స్ వచ్చింది, త్వరలోనే మూడవ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

ఈ సినిమా లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. సౌత్ ఇండియన్ సెన్సేషన్ అనిరుథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ చిత్రం పై ఫ్యాన్స్ లోనే కాదు, ఆడియన్స్ లో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

NTR 30

ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవ్వబోతుంది అనేది తెలియదు కానీ, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన క్యాస్టింగ్ విషయం లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఇప్పటి నుండి కసరత్తులు ప్రారంభించినట్టు సమాచారం. అయితే ఈ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం , ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ని సంప్రదించినట్టు తెలుస్తుంది. బాలీవుడ్ లో అగ్ర కథానాయికగా ఎదిగి, ఆ తర్వాత హాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ అక్కడ స్టార్ హీరోయిన్ గా స్థిరపడిన ప్రియాంక చోప్రా రేంజ్ ఇప్పుడు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంది.

- Advertisement -
NTR 31

అక్కడ మిలియన్ డాలర్స్ లో పారితోషికం తీసుకుంటున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు మళ్ళీ ఇండియా లోకి అడుగుపెట్టి ఎన్టీఆర్ తో సినిమా చేస్తుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. #RRR మూవీ కి ఆస్కార్ అవార్డ్స్ వచ్చినప్పుడు అమెరికా లో ప్రియాంక చోప్రా ని కలిసాడు ఎన్టీఆర్, అలా వీళ్లిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. మరి ప్రశాంత్ నీల్ రిక్వెస్ట్ ని స్వీకరించి ప్రియాంక చోప్రా ఈ చిత్రం లో నటిస్తుందో లేదో చూడాలి. ప్రియాంక చోప్రా వయస్సులో ఎన్టీఆర్ కంటే చాలా పెద్ద, మరి ఫ్యాన్స్ ఆమెని హీరోయిన్ అని ప్రకటించిన తర్వాత ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి.

NTR Prashanth neel
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here