Actress Sreeleela : మాస్ లుక్‌లో శ్రీలీల ధమాకా పోజులు

- Advertisement -

Actress Sreeleela : శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఈ బ్యూటీ రాఘవేంద్ర రావు పరిచయం చేసిన బాపు బొమ్మ. పెళ్లిసందడి మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ కుందనపు బొమ్మ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

Actress Sreeleela
Actress Sreeleela

పెళ్లి సందడి మూవీ అంతగా హిట్ కాకపోయినా.. ఆ మూవీలో ఈ భామ అందం, అభినయం చూసి నిర్మాతలు ఈ బ్యూటీ కాల్షీట్ల కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఏడు ప్రాజెక్టులున్నాయంటే.. ఆమె డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

Sreeleela photos
Sreeleela photos

ఇటీవలే ధమాకా మూవీతో దుమ్మురేపే హిట్ అందుకున్న శ్రీలీల ఆ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Sreeleela mass look
Sreeleela mass look

మాస్ లుక్‌లో శ్రీలీల ధమాకా పోజులతో హల్‌చల్ చేస్తోంది. తన అందాలు ఆరబోస్తూ ప్రకృతి ఒడిలో సేదతీరుతోంది. ఆరెంజ్ కలర్ ఔట్‌ఫిట్‌లో అదిపోయే పోజులతో కుర్రాళ్లను కవ్విస్తోంది.

Sreeleela Photo shoot
Sreeleela Photo shoot

ఇన్ని అవకాశాలు రావడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పేసింది ఈ బ్యూటీ. తెలుగు సినీ రంగంలో తనకు మొదటి అవకాశం ఇచ్చి తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేనని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది శ్రీలీల. రాఘవేంద్రరావు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది ఈ బ్యూటీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here