Tollywood Bachelor : త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్..?



Tollywood bachelor : టాలీవుడ్​లో మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్స్​ అంతా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనుకున్న రానా కరోనా టైంలో సర్‌ప్రైజ్ ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. అసలు ఎలాంటి పుకార్లు లేకుండా సడెన్‌గా తన పెళ్లి కబురు చెప్పి.. పది రోజుల్లోపే ఓ ఇంటి వాడయ్యాడు నాగశౌర్య. ఎంతో కాలంగా కో స్టార్‌తో ప్రేమాయణం నడిపి బంధువుల సమక్షంలో గ్రాండ్‌గా పెళ్లి పీటలెక్కాడు ఆది పినిశెట్టి. ఇప్పుడు టాలీవుడ్‌లో మరో యంగ్ అండ్ డైనమిక్ హీరో పెళ్లి కబురు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ అందగాడు ఎవరనుకుంటున్నారా..?

Tollywood Bachelor
Tollywood Bachelor

టాలీవుడ్‌లో ది మోస్ట్​ అవెయిటడ్​ స్టార్ బ్యాచిలర్ శర్వానంద్‌ పెళ్లి ఫిక్స్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవును ఇది నిజమేనని సినీ వ‌ర్గాల టాక్​. సోషల్​ మీడియాలో వైరలవుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే హీరో శ‌ర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారని.. ఆమె తెలంగాణకు చెందిన సాఫ్ట్​వేర్​ యువతి అని టాక్​. తెలుగు సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శర్వానంద్. రీసెంట్‌గా బాలయ్య కూడా ‘అన్‌స్టాపబుల్’ షోలో ఇతను పెళ్లి విషయం ప్రస్తావించగా.. ప్రభాస్ పెళ్లి తర్వాత అంటూ దాటవేసే ప్రయత్నం చేశాడు. ఇంతలోనే శర్వా పెళ్లి కబురు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

Actor Sharwanand
Actor Sharwanand

ఏమైతేనేం ఎట్టకేలకు శర్వానంద్  ఓ ఇంటివాడు కాబోతున్నాడని ఫ్యాన్స్ సంబుర పడుతున్నారు. ఇక శర్వాకు కాబోయే వధువు అమెరికాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని శర్వా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అమెరికాలో జాబ్​ చేస్తున్న ఈమె ప్రస్తుతం కొవిడ్​ కారణంగా హైదరాబాద్​లోనే వర్క్​ ఫ్రమ్​ హోమ్​ చేస్తున్నారట. మరో సమాచారం ఏంటంటే.. వీరిద్దరు గతకొంత కాలంగా ప్రేమలో ఉన్నారని వీరి గురించి ఇంట్లో చెప్పి శర్వానంద్​ తన పెళ్లికి లైన్ క్లియ‌ర్ చేసుకున్నార‌ట. అయితే ఈ విషయాన్ని శర్వానంద్​ ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. దీంతో ఇవి రూమర్స్​ అని కొందరు కొట్టి పారేస్తున్నప్పటికీ తమ అభిమాన హీరో ఓ ఇంటి వాడు అవుతున్నాడు అన్న ఊహ ఎంత బాగుందని ఫ్యాన్స్​ సంబురపడిపోతున్నారు.

Sharwanand Marrige
Sharwanand Marrige

ఈ విషయంపై త్వరలోనే శర్వానంద్ కుటుంబం అధికారిక ప్రకటన చేసే అవకాశముందట. ప్రస్తుతం శర్వానంద్ వయసు 38 ఏళ్లు. 2003లో విడుదలైన  ‘ఐదో తారీఖు’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు శర్వా. ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. చిరంజీవితో థమ్స్ అప్ యాడ్‌లో నటించడమే కాకుండా.. ‘శంకర్ దాదా MBBS సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ఆ తర్వాత వెంకటేశ్‌తో ‘సంక్రాంతి’, ‘లక్ష్మి’ చిత్రాల్లో హీరో తమ్ముడు పాత్రలో నటించాడు.  ఇక గమ్యం సినిమాతో తెలుగు, తమిళంలో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు.

వరుస సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘గమ్యం’, ప్రస్థానం, శతమానం భవతి వంటి చిత్రాల్లో శర్వానంద్‌కు నటుడిగా మంచి మార్కులు పడ్డాయి. అంతకు ముందు వెన్నెల సినిమాలో సైకో క్యారెక్టర్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘మహానుభావుడు’ తర్వాత సరైన సక్సెస్‌లేని శర్వానంద్ 2022లో మూడు సినిమాల్లో మెరిశారు. ‘మ‌హా స‌ముద్రం’,’ఆడ‌వాళ్లు మీకు జోహార్లు’ సినిమాలు బాక్సాఫీస్​ వద్ద నిరాశపరచగా..’ఒకే ఒక జీవితం’ మాత్రం స‌క్సెస్ సాధించింది. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకున్నాడు. 2022లో మంచి సక్సెస్‌తో ఎండ్ చేసిన ఇతను 2023లో ఒక ఇంటి వాడు కావడం ఆనందించదగ్గ పరిణామం.

Tags: