Bala Krishna : బాలయ్యా..మజాకా.. అదిరిపోయే స్టెప్పులేసిన అలనాటి తార..వీడియో వైరల్..

- Advertisement -

Bala Krishna : నందమూరి బాలకృష్ణ తాజాగా నటిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’..ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది..ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ కు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకు అదిరిపోయే సంగీతాన్ని అందించాడు మ్యూజిక్ డైరెక్టర్ థమన్..ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇక ఈ మూవీ గ్లిమ్ప్స్ పై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Bala Krishna
Bala Krishna

ఇక వీరసింహ రెడ్డి నుంచి విడుదలైన జై బాలయ్య, సుగుణ సుందరి, మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటలు యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కంటిన్యూ అవుతున్నాయి. ఇక ఈ సినిమా కోసం నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులేశారు.. అలనాటి అందాల తార జయమాలిని.. ఈ సినిమాలోని మా భావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటకు డాన్స్ చేశారు జయమాలిని, ప్రముఖ యూట్యూబర్ తో కలిసి జయమాలిని ఈ పాటకు డాన్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

Actor Balla krishna
Actor Balla krishna

నిజానికి జయమాలిని ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి హీరోలతో పాటు చిరంజీవి, బాలయ్య సినిమా ల్లోనూ స్పెషల్ సాంగ్స్ చేశారు. ఆమెకు బాలకృష్ణ అంటే ప్రత్యేక అభిమానం. ఇటీవలే అన్ స్టాపబుల్ షూటింగ్ సెట్ కు వెళ్లి కూడా ఆయనను కలిశారు జయమాలిని. ఇక వీరసింహారెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 6 న ఒంగోలులో గ్రాండ్ గా నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేసిన సంగతి తెలిసిందే..సంక్రాంతి బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్..మరి రిజల్ట్ ఎలా వుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here