Sreeleela : ఈ అమ్మడు నిజంగా నక్క తోక తొక్కొచ్చినట్టుంది .. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది!

- Advertisement -

Sreeleela .. మొన్నటిదాక టాలీవుడ్ లో మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన్. నిర్మాతల ఫస్ట్ ఛాయిస్. హీరోల మెయిన్ ఛాయిస్. కానీ వరుస ఫ్లాప్ లు మూటగట్టుకోవడంతో ఈ భామకు ఐరన్ లెగ్ ముద్ర పడిపోయింది. ఇక నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి. ఛాన్సులు వచ్చినా.. ఒకే తరహా స్క్రిప్ట్స్ వస్తుండటంతో ఈ బ్యూటీ వాటిని రిజెక్ట్ చేస్తూ వస్తోంది. కొన్నాళ్ల నుంచి ఈ భామ ఒక్క మూవీకి కూడా సైన్ చేయలేదు. ఇక కొన్నిరోజులు బ్రేక్ తీసుకుని, తన డాక్టర్ చదవు కొనసాగించాలని కూడా ఈ బ్యూటీ డిసైడ్ అయిపోయిందట.

sreeleela
Sreeleela

ఇదంతా మొన్నటి మాట. శ్రీలీల ఈజ్ బ్యాక్. మళ్లీ ఈ భామ ట్రాక్ లో పడింది. ఎన్ని ఫ్లాప్ లు వచ్చినా తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేసింది. ఈసారి ఏకంగా స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసింది. అది కూడా అలాంటిలాంటి స్టార్ కాదు.. హీరోయిన్ అయిన ప్రతి అమ్మాయి.. నటించాలనుకునే హీరో. అదే మన కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్.

 అజిత్‌ హీరోగా ‘మార్క్‌ ఆంటోనీ’ ఫేమ్‌ అధిక్‌ రవిచంద్రన్‌ దర్శకత్వంలో ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే సినిమా వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై  ఇది నిర్మితం అవుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు అందించనున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ శ్రీలీలను వరించినట్లు సమాచారం.

- Advertisement -

ఈ మూవీ కోసం చిత్రబృందం ఇప్పటికే శ్రీలీలను సంప్రదించారని టాక్. కథ నచ్చడంతో ఈ భామ ఓకే కూడా చెప్పేసిందట.  ఒకవేళ ఇదే కనుక నిజమైతే శ్రీలీల కెరీర్ మళ్లీ ట్రాక్ లో పడుతుందని ఆమె అభమానులు భావిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రం తర్వాత ఈ బ్యూటీ కోలీవుడ్ లో బిజీ అయ్యే ఛాన్స్ కూడా ఉందని విశ్లేషకుల అంచనా. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

పెళ్లిసందడి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల ఫస్ట్ మూవీ ఫ్లాప్ అయినా ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. ధమాకా’ తో వంద కోట్ల హీరోయిన్ కూడా అయిపోయింది. అయితే ధమాకా తర్వాత శ్రీలీలకు కలిసి రాలేదు. ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. ఎక్స్ ట్రార్డినరీ మ్యాన్, స్కంద, ఆదికేశవ.. ఇలా వరుసగా చిత్రాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ‘భగవంత్ కేసరి’ కాస్త ఊరట కలిగించింది ఈ భామకు. ఇక ఆ చిత్రం తర్వాత వచ్చిన గుంటూరు కారం కూడా అంతగా ఇంపాక్ట్ చూపించలేదు ఈ భామ కెరీర్ కు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం శ్రీలీల కెరీర్‌ పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ భామకు తాజాగా అజిత్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చిందని టాక్

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here