Jr NTR : ముంబయిలో టాలీవుడ్ టైగర్.. ఎగబడ్డ ఫ్యాన్స్.. ఇదేం మాస్ క్రేజ్ మావా

- Advertisement -

Jr NTR : బాహుబలి చిత్రం ముందు వరకు టాలీవుడ్ లో పాన్ ఇండియా మాటే వినిపించలేదు. ఆ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమను దేశంలోని అన్ని సినిమా పరిశ్రమలకు పరిచయం చేసింది. ఆర్ఆర్ఆర్ తో అది కాస్త అంతర్జాతీయ స్థాయికి పాకింది. అలా ఇప్పుడు దాదాపు ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా.. పాన్ ఇండియా చిత్రంగానే దాన్ని వివిధ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత టాలీవుడ్ టు బాలీవుడ్, బాలీవుడ్ టు టాలీవుడ్.. హీరోలు, నటులు సినిమాలు తీయడం కూడా ఎక్కువైంది. అంతకుముందు ముంబయి నుంచి కేవలం హీరోయిన్లనే తీసుకొచ్చేవారు.. కానీ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోల వరకు, చివరకు విలన్ల కోసం కూడా అటువైపే చూస్తున్నారు.

Jr NTR
Jr NTR

ఇక బాలీవుడ్ కూడా ఇన్నాళ్లు తెలుగు చిత్ర పరిశ్రమను పెద్దగా కేర్ చేయలేదు. కానీ ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీకి ఉన్న క్రేజ్ చూసి.. అక్కడి బడా నిర్మాతలు కూడా మన హీరోలు, దర్శకుల వైపు చూస్తున్నారు. ఎంతగా అంటే చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా మన తెలుగు వాళ్లను తీసుకెళ్తున్నారు. ఇక మల్టీస్టారర్ సినిమాలు కూడా తెలుగు హీరోలతో కలిసి చేస్తున్నారు. అలా ఇప్పటికే బాలీవుడ్ లో తెలుగు హీరోల ఎంట్రీ షురూ అయింది.

- Advertisement -

అందులో ముఖ్యంగా మన టాలీవుడ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నాడు. తారక్ త్వరలోనే వార్-2 మూవీతో హిందీలో ఎంట్రీ ఇస్తున్నాడు. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ తో కలిసి ఇందులో తారక్ నటిస్తున్నాడు. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న బిగ్ బడ్జెట్ మూవీ వార్ 2 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ మూవీలో తారక్ ది నెగిటివ్ షేడ్స్ లో ఉన్న క్యారెక్టర్ అని టాక్. ఇప్పటికే తారక్ జైలవకుశలో రావణ్ గా నెగిటివ్ రోల్ ఏ రేంజ్ లో చింపేశాడో తెలిసిందే. ఇక ఇప్పుడు హిందీ మూవీ.. అది కూడా పాన్ ఇండియా రేంజ్.. అంటే మన టైగర్ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.

ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్న తారక్.. తాజాగా వార్-2 సెట్ లో కూడా అడుగుపెట్టాడట. అందుకోసం ఇటీవల ముంబయికి వెళ్లాడు. అక్కడ ఎయిర్ పోర్టులో తారక్ ను చూడగానే అందరూ షాక్. తారక్ కనిపించగానే హే.. భీమ్ అంటూ అందరూ చుట్టుముట్టేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఎన్టీఆర్ ముంబయి ఎయిర్ పోర్టు విజువల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇందులో తారక్ బ్లూ జీన్స్ వైట్ షర్ట్ లో కనిపించాడు. తలకు బ్లాక్ క్యాప్, గాగుల్స్ తో హాలీవుడ్ హీరోను తలపించాడు. తారక్ ఈ లుక్ అదిరిపోయిందని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఎన్టీఆర్.. దాదాపు మూడు వారాలకు పైగానే వార్-2 షెడ్యూల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ద్వారా కొన్ని యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారట. కేవలం యాక్షన్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా ఎన్టీఆర్ డాన్స్ తో కూడా బాలీవుడ్ జనాలకు సరికొత్త కిక్ ఇవ్వబోతున్నారట. అయితే ఈ మూవీలో ఉన్న మరో హీరో హృతిక్ కూడా డ్యాన్స్ కు పెట్టింది పేరు. ఈ గ్రీక్ గాడ్ స్వాగ్ కు ఇప్పటి వరకు సాటి ఎవరూ రాలేదు. కానీ ఇప్పుడు ఈ ఇందరూ సూపర్ డ్యాన్సర్స్ ఒకేసారి ఆడితే ఉంటది.. వాహ్.. వినడానికే ఏం ఫీల్ ఉంది మావా.. ఆ సాంగ్ ఈ సినిమాకే హైలైట్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఎప్పుడెప్పుడు ఆ న్యూస్ వస్తుందా అని ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here