భర్తతో దూరంగా ఉంటున్న స్నేహ.. ఈ జంటది కూడా విడాకుల బాటేనా..?

- Advertisement -

అలనాటి తారల్లో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే చాలా మంది టక్కున చెప్పే పేరు సౌందర్య. దురదృష్టవశాత్తు సౌందర్య మనకు దూరమైపోయారు. కానీ ఆమె స్థానాన్ని భర్తీ చేస్తూ సౌందర్యలాంటి చక్కని రూపం.. మధురమైన చిరునవ్వు.. ఆకట్టుకునే ఆహార్యం.. చూడగానే ఆకర్షించే హోమ్లీనెస్‌తో స్నేహ టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. హోమ్లీ బ్యూటీగా ప్రతి మహిళతో పాటు పురుషులు కూడా అభిమానించే నటి స్నేహ. కేవలం అభిమానమే కాదు.. అలనాటి సావిత్రి, సౌందర్యలకు ఎంత గౌరవం ఇస్తారో స్నేహని కూడా అంతే గౌరవిస్తారు. సౌందర్య తర్వాత ఆ రేంజ్‌లో ప్రతి ఒక్కరి గౌరవం, అభిమానం దక్కించుకున్న నటి స్నేహ.

స్నేహ
స్నేహ

 

తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితోనూ స్నేహ నటించారు.ప్రస్తుతం వెండితెరపై ఆమె కనుమరుగయ్యారు. రీసెంట్‌గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కొన్ని సెలెక్టడ్ సినిమాల్లో మాత్రమే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలా చేసిన పాత్రల్లో వినయ విధేయ రామ మూవీలో స్నేహ పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలుపట్టారు. ఆ తర్వాత స్నేహ ఇక టాలీవుడ్‌లో బిజీ అయిపోయారు. ఓవైపు సినిమాలు మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్‌కి గెస్ట్‌గా వస్తూ అటు సినీ ప్రేక్షకులను.. ఇటు టీవీ ఆడియెన్స్‌ను అలరిస్తున్నారు.

- Advertisement -

స్నేహ తెలుగుతో పాటు తమిళంలో కూడా చాలా ఫేమస్. తమిళంలో నటిస్తున్నప్పుడే పరిచయమైన నటుడు ప్రసన్నకుమార్‌తో ప్రేమలో పడ్డారు స్నేహ. ఆ తర్వాత ఇరు కుటుంబాల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. పెళ్లి అనంతరం సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చిన స్నేహ ఆమె రామ్‌ చరణ్‌ వినయ విధేయ రామతో రీఎంట్రీ ఇచ్చారు.

కోలీవుడ్‌లో ఎంతో అన్యోన్య కపుల్‌గా పేరుగాంచిన ఈ జంట వైవాహిక బంధం మూడు పూవులు ఆరు కాయలు అన్న చందంగా హ్యాపీగా సాగుతోంది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లడం.. ఎప్పుడూ మ్యాచింగ్ వస్త్రధారణతో చూడ్డానికి రెండు కళ్లు చాలనంత ప్రేమ కనిపించేది వారి మధ్య. భర్త పిల్లలతో కలిసి తీసుకున్న ఫ్యామిలీ ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ స్నేహ. ఇప్పుడు ఈ హోమ్లీ బ్యూటీకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..?

 

 

స్నేహ కొద్ది రోజులుగా తన భర్త ప్రసన్న కుమార్‌కు దూరంగా ఉంటుందనే వార్తలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా వేరుగా ఉంటోందంటూ పలు తమిళ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ స్నేహ-ప్రసన్నల అందమైన జంట విడిపోవడం తాము చూడలేమంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. వారి మధ్య మనస్పర్థలు వీలైనంత త్వరగా తొలగించుకుని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మరికొందరేమో సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ క్యాజువల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

స్నేహ-ప్రసన్నల జంట వారి మధ్య మనస్పర్థలు తొలగించుకొని ఒకటవుతారా లేక విడాకులు తీసుకొని తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతారా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ జంట గురించి వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే వీరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. అప్పటి వరకు ఫ్యాన్స్‌కి ఈ వెయిటింగ్ తప్పదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here