Niharika Konidela : బీచ్‌లో మెగా డాటర్ నిహారిక హాట్‌ లుక్స్‌.. బికినీలో.. 

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల. టీవీస్క్రీన్‌పై యాంకర్‌గా తన కెరీర్‌ మొదలుపెట్టింది Niharika Konidela బ్యూటీ. ఆ తర్వాత వెబ్‌సిరీస్, సినిమాలు చేస్తూ మెగా కాంపౌండ్‌ నుంచి వచ్చిన ఫస్ట్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఒక మనసు చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిహా.. అందులో హీరోగా నటించిన నాగశౌర్య మనసుతో పాటు అందరి మనసూ గెలిచేసింది. ఆ సినిమాలో చాలా పరిణతి ఉన్న యువతి పాత్రలో చాలా మెచ్యూర్డ్‌గా నటించి విమర్శల మెప్పు కూడా పొందింది. సినిమా ఆడకపోయినా ఆ తర్వాత నిహారికకు ఆఫర్లకు కొదువేం లేకుండా పోయింది.

 

- Advertisement -

ఒక మనసు ఫ్లాప్ అయినా బెదిరిపోకుండా ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలతో బబ్లీ క్యారెక్టర్లలో నటించింది. ఈ సినిమాలు ఫర్వాలేదు అనిపించాయి. ఈ మూవీస్‌లో నిహా క్యారెక్టర్‌కి ప్రతి ఒక్క అమ్మాయి కనెక్ట్ అయింది. ఇక ప్రతి అబ్బాయి ఇలాంటి పెంకిపిల్ల గర్ల్ ఫ్రెండ్‌గా వస్తే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని ఫీల్ అయ్యారు.

 

ఇంట్లో అయినా.. సెట్‌లో అయినా.. ఇంటర్వ్యూల్లో అయినా నిహారిక చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఈ బ్యూటీ ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది. ఇంకా ఎంటర్‌టైన్మెంట్ పక్కాగా ఉంటుంది. ఈ మెగా భామకు మెగా బ్రదర్స్‌ దగ్గర గారాబం ఎక్కువ. సినిమా ఇండస్ట్రీకి హీరోలను ప్రొడ్యూస్‌ చేసే ఓ కాంపౌండ్‌ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారికకు షికార్లు చేయడం అంటే మహా సరదా. అందుకే తరచూ తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెకేషన్లకు వెళ్తుంటుంది.

 

చూడ్డానికి అందంగా.. ముద్దుగా కనిపించే నిహారిక మొదట్లో మెగా ఫ్యాన్స్ తనని ఎలా రిసీవ్ చేసుకుంటారోనన్న భయంతో కాస్త పద్ధతిగా ఉండేది. కానీ ఫ్యాన్స్ తను ఎలా ఉన్న ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ వచ్చాక ఇక తనకు నచ్చినట్లు ఉంటోంది. ఈ క్రమంలోనే కాస్త గ్లామర్ డోస్ పెంచి ట్రెండీ లుక్‌లో ఫ్యాన్స్‌కు కనువిందు చేస్తోంది. ఇక తాను చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ బ్యూటీ గ్లామర్ ఇంకాస్త పెరిగిందనే చెప్పాలి.

 

ఖాళీ సమయం దొరికితే చాలు ఫ్రెండ్స్, పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తుంది. తాజాగా ఈమె తుర్కియే(టర్కీ) విమానం ఎక్కింది. తన ఫ్రెండ్స్‌తో కలిసి వెకేషన్​ను హ్యాపీగా, జాలీగా గడిపింది. ఇక అక్కడి బీచ్‌లలో తెగ ఎంజాయ్ చేసింది. వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ భామ ఎప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేసినా లైక్ చేసి క్యూట్, క్యూటీ, బ్యూటీ అంటూ కామెంట్స్ చేసే ఫ్యాన్స్.. టర్కీ వెకేషన్ ఫొటోలు చూసి మాత్రం ముక్కున వేలేసుకున్నారు.

 

టర్కీ వెకేషన్‌లో నిహారిక కాస్త ఎక్స్‌పోజింగ్ పెంచేసింది. బీచుల్లో, స్విమ్మింగ్ ఫూల్స్‌లో బికినీ వేసుకున్న ఫొటోలు చూసి సోషల్ మీడియా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. నిహారిక బికినీ వేసుకుని సరదాగా గడుపుతున్న సమయంలో తీసిన ఫొటోలు కొన్ని నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. మెగా డాటర్ ఇలాంటి బట్టలు వేసుకుందేంటి అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. స్విమ్మింగ్ ఫూల్స్, బీచ్‌లలో కూడా చీరలు కట్టుకుని తిరగలేరు కదా అని మరికొందరు నిహాని సపోర్ట్ చేస్తున్నారు.

అయితే నిహా టర్కీ వెకేషన్ఫొటోల్లో నెటిజన్లను ఆకట్టుకున్న మరో విషయం ఉంది. అదే నిహారిక వీపు మీద ఉన్న టాటూ. ఈ టాటూను కాస్త తీక్షణంగా పరిశీలిస్తే ‘NK’ అనే లెటర్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఈ లెటర్స్ అర్థం ఏంటని నెటిజన్లు తెగ ఆలోచించేస్తున్నారు. చివరకు ‘NK’ అంటే నిహారిక కొణిదెల కావొచ్చని ఓ అంచనాకు వచ్చారు. ఆ అక్షరాలకు పక్కనే ఓ బర్డ్ ఎగురుతున్నట్లు కనిపిస్తుంది. దాని పక్కన ఓ వింత డిజైన్ కనిపిస్తుంది. దాని పూర్తి అర్థం ఎవరికీ తెలియకపోయినా.. ‘NK’ అంటే నిహారిక కొణిదెల అని ఫిక్స్​ అవుతున్నారు. వాస్తవానికి నిహారిక వీపు మీద ఉన్న టాటూ ‘సైరా’ సినిమా షూటింగ్ సమయంలోనే కనిపించింది.

ఇక ప్రస్తుతం నిహారిక సినిమాలు ఏం చేయడం లేదు. తన బ్యానర్ పింక్ ఎలిఫెంట్ లో వెబ్‌సిరీస్‌లు నిర్మిస్తోంది. ఈ బ్యానర్‌లో నిర్మించిన ముద్దపప్పు ఆవకాయ, నాన్నకూచి సిరీస్‌లలో స్వయంగా తానే నటించింది. రీసెంట్‌గా ఈ బ్యానర్‌ నుంచి ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ అనే వెబ్‌సరీస్‌లు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here