పనిమనిషి ముఖంపై ఉమ్మేసిన హీరోయిన్.. ఆపై లైంగిక వేధింపులు..!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. సెలబ్రిటీలు కెమెరా ముందు ఎల్లప్పుడు నటిస్తూనే ఉంటారు.. ఉండాలి కూడా. కెమెరా ముందు ఎంత మహోన్నత వ్యక్తిగా ఉన్న కొందరు నిజజీవితంలో దానికి పూర్తి భిన్నంగా ఉంటారు. అలా సిల్వర్ స్క్రీన్‌పై ఓ వెలుగు వెలిగిన ఓ తార రియల్ లైఫ్‌లో మాత్రం పూర్తి విరుద్ధంగా ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. నిజ జీవితంలో ఆమె ప్రవర్తనపై చాలా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరామె..? ఇంత విమర్శలు ఎదుర్కోవడానికి కారణమేంటి..?

parvathy nair
parvathy nair

 

యంగ్ అండ్ బోల్డ్ బ్యూటీ పార్వతి నాయర్. ఈ భామ తెలుగు సినిమా ప్రేక్షకులకు దాదాపు తెలియదు కానీ మలయాళ, తమిళ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఈ రెండు భాషల్లో ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్‌సిరీస్‌లు చేస్తూ చాలా బిజీబిజీగా గడుపుతోంది. ఈ హాట్ బ్యూటీ ఇంకా తెలుగు సినిమాల్లో ఎంట్రీ ఇవ్వలేదు. సోషల్ మీడియా పుణ్యమాని ప్రపంచం అరచేతుల్లోకి వచ్చిన నేటి జనరేషన్‌లో తెలియని విషయాలంటూ ఉండవు. అలా సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఈ భామ తెలుగు యువకుల కళ్లలో పడింది. ఇంకేంటి ఎప్పుడెప్పుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుందా అని ప్రేక్షకులు వెయిటింగ్.

- Advertisement -

సోషల్ మీడియాలో కైపెక్కించే ఫొటోలతో కవ్వించే పోజులతో ఈ బోల్డ్ బ్యూటీ యువకుల గుండెలు కొల్లగొట్టేస్తోంది. హాట్ హాట్ పోజులిస్తూ అందాలను ఆరబోస్తూ నెట్టింట సెగలు పుట్టిస్తోంది. అయితే ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ కాస్తలో మిస్ అయిందని తెలిసి తెలుగు యువత చాలా డిసప్పాయింట్ అయింది. అది కూడా ఫేమస్ తెలుగు మూవీ అర్జున్ రెడ్డి మూవీలో ఆఫర్ వదులుకుందని ఇంకా బాధపడ్డారట. కుర్రాళ్లే కాదు ఆ ఆఫర్ మిస్ చేసుకున్నందుకు పార్వతి కూడా ఫీల్ అవుతోందట. ఆ ఆఫర్‌కే కనుక పార్వతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదుంటే.. పార్వతి కాస్త ప్రీతి అయుండేది. తెలుగు యువకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేది.

సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటూ ఘాటు అందాలు ఆరబోసే పార్వతిపై తాజాగా సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె ఇంటి గుట్టు రట్టయిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ పార్వతి ఇంట్లో ఏం జరిగింది.. ఆమెపై నెటిజన్లు ఎందుకు ఫైర్ అవుతున్నారు అంటే..?

పార్వతి నైర్ ఇంట్లో పని చేస్తున్న పనిమనిషి ఆమెపై సంచలన ఆరోపణలు చేశాడు. ఈ బోల్డ్ బ్యూటీ తనపై లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తోందని ఆరోపించాడు. గత నెలలో పారు ఇంట్లో రూ.9 లక్షల విలువైన వాచ్‌లు, ఒక ఐఫోన్, రూ.2 లక్షల విలువైన ల్యాప్‌టాప్ చోరీ అయ్యాయట. ఇక పార్వతికి ఆ పనిమనిషిపైనే డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై ఆ పనిమనిషి స్పందిస్తూ పార్వతిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఇంట్లో ఎవరో చోరీ చేస్తే తనపై నింద మోపుతోందని.. తనని పలుమార్లు కొట్టడమే కాకుండా.. ముఖంపై ఉమ్మేసిందని ఆరోపించాడు. ఇంకా లైంగిక వేధింపుల కేసు పెడతానని బెదిరిస్తున్నట్లు వాపోయాడు. పార్వతి ఇంట్లో చోరీ కేసుపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here