Pavitra Naresh : ఆగలేకపోతున్న పవిత్ర , నరేష్.. మరీ ఇంత పిచ్చా..?

- Advertisement -

Pavitra Naresh : పవిత్ర లోకేష్ వీకె.నరేష్ ప్రేమలో మునిగి తేలుతున్నారు. ముదురు ప్రేమలతో నిత్యం హాట్ టాపిక్ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన మళ్లీ పెళ్లి టీజర్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.అదే సమయంలో ట్రోలర్స్ ఆడుకుంటున్నారు. నటి పవిత్ర లోకేష్ సీనియర్ నటుడు వికే నరేష్ ఇప్పుడు ఇటు తెలుగులో అటు కన్నడలో హాట్ టాపిక్ అవుతున్నారు. గత ఏడాది నుంచి వీరిద్దరూ కలిసి తిరగడం నరేష్ భార్య రమ్య రఘుపతి ఆయనపై అనేక ఆరోపణలు చేయడం గొడవలు జరగడం వంటి సంఘటనలు చర్చనీయాంశంగా మారాయి. దీనికి తోడు నరేష్, పవిత్ర లోకేష్ కలిసి తిరగడం మరింత హీటెక్కి పోతుంది.

Pavitra Naresh
Pavitra Naresh

తన మూడో భార్య రమ్య రఘుపతి నుంచి విడాకులు రాగానే తాను పవిత్రని పెళ్లి చేసుకుంటాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో నరేష్ కి రమ్య రఘుపతి కి గొడవలు జరుగుతున్నాయి. అవన్నీ కాదని ఆ మధ్య నరేష్ పవిత్ర పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.కొత్త ఏడాది సందర్భంగా కేక్ కట్ చేసి తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఏకంగా లిప్ కిస్ కూడా పెట్టుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకి పెళ్లయిపోయినట్లుగా ఓ వీడియోను పంచుకున్నారు. కానీ ఇది సినిమా కోసం ఆడిన డ్రామా అని సినిమాలోని సీన్లు అంటూ తర్వాత లీక్ అయింది.

Pavitra Naresh  MOvie

ఆ లీక్ ని నిజం చేస్తూ “మళ్ళీ పెళ్లి” అంటూ సినిమా అని ప్రకటించారు ఈ జోడి.. ఎంఎస్ రాజు దీనికి దర్శకుడు. నరేష్ తన విజయ్ కృష్ణ మూవీస్ పథకాలపై ఎం ఎస్ రాజుతో కలిసి విమర్శిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదలైంది.ఇందులో తన రియల్ లైఫ్ ని ఆవిష్కరించారు. తన భార్యతో గొడవలు, ఆ తర్వాత ఈ ఇద్దరు పెళ్లి ఎంజాయ్ చేయడం. వంటివి చూపించారు. చివరగా ఇద్దరు కన్ను కొట్టుకోవడం హైలెట్ గా నిలిచింది. మొత్తం గా నరేష్ పవిత్రల మళ్ళీ పెళ్లి టీజర్ ని రచ్చ రచ్చ చేస్తున్నారు.ట్రోల్స్ మీన్స్ వైరల్ సీన్లతో ఇప్పుడు మళ్లీ పెళ్లి టీజర్ ఇంటర్నెట్ ని ఊపేస్తుందనటం విశేషం. మొత్తానికి దర్శకుడు ఎంఎస్ రాజు ఫ్రీగా పబ్లిసిటీ కొట్టేస్తున్నారని చెప్పడంతో అతిశయోక్తి లేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here