బాహుబలి సిరీస్ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మూడు భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేస్తే, ఆ మూడు కూడా ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఓపెనింగ్స్ తప్ప ఫుల్ రన్ లో ఘోరమైన వసూళ్లను రాబట్టి బయ్యర్స్ కి వందల కోట్ల రూపాయలలో నష్టాలను తెచ్చిపెట్టాయి. ఇది ప్రభాస్ అభిమానులకు మింగుడు పడని విషయం. ఇప్పుడు వాళ్లంతా భారీ ఆశలు పెట్టుకున్న తదుపరి ప్రభాస్ చిత్రం ‘సలార్’.
కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 23 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. కేవలం ప్రాంతీయ భాషల్లో మాత్రమే కాదు. ఇంగ్లీష్ లో కూడా ఈ చిత్రం విడుదల అవుతుంది. #RRR తర్వాత వచ్చిన పాన్ వరల్డ్ మార్కెట్ ని ఎలా అయినా ఉపయోగించుకోవాలి అని సలార్ టీం బలంగా ఫిక్స్ అయ్యింది. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇది ఇలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు అభిమానులను తెగ కలవరపెడుతుంది. అదేమిటంటే ఈ చిత్రం లో కేవలం ఒకే ఒక్క థీమ్ సాంగ్ మాత్రమే ఉంటుందట. కేజీఎఫ్ తరహా లో సాంగ్స్ అసలు ఉండవనే రూమర్ బలంగా వినిపిస్తుంది. సందర్భానికి తగ్గట్టుగా అక్కడక్కడా కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయట అంతే.
ఒక పూర్తి స్థాయి వయోలెన్స్ తో నిండిన ఒక సినిమాని పాటలు లేకుండా రెండు గంటల 24 నిమిషాలు చూడాలంటె ప్రేక్షకులతో పాటుగా , ఆడియన్స్ సహనానికి కూడా పెద్ద పరీక్షే. ఎంత కంటెంట్ ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి కదలాలంటే కచ్చితం గా పాటలు ఉండాల్సిందే. లేకపోతే కేవలం ఒక సెక్షన్ ఆడియన్స్ కి మాత్రమే ఈ చిత్రం పరిమితం అయిపోతుందనే టెన్షన్ అభిమానుల్లో నెలకొంది. మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.