ఏంటిది.. హీరోయిన్ సిమ్రాన్ ఇంతమంది హీరోలతో ఎఫైర్లు నడిపిందా ?

- Advertisement -

ఒకానొక టైంలో తన నడుమందాలతో సినీ ఇండస్ట్రీని షేక్ ఆడించిన అందాల భామ సిమ్రాన్. ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో కనిపించి తన అభిమానులను అలరిస్తున్నారు సిమ్రాన్. సీనియర్ హీరోల నుంచి ప్రస్తుతం స్టార్లుగా మారిన కుర్ర హీరోలందరితో ఆడిపాడారు సిమ్రాన్. సౌతిండియాలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే పెళ్లికి ముందు చాలామంది హీరోలతో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అందులో నిజం ఎంతో తెలియదు కానీ సిమ్రాన్ తో ఎఫైర్ పెట్టుకున్న హీరోల లిస్టు మాత్రం చాలానే ఉంది. వారి జాబితాల విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఉన్నారు. వీరి కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి. బ్రహ్మచారి, పంచతంత్రం వంటి బ్యాక్ టు బ్యాక్ రావడంతో వారి మధ్య ఏదో ఉందన్న పుకార్తు వినిపించాయి. అక్కడితో ఆగకుండా కమల్ హాసన్ ను.. సిమ్రాన్ పెళ్లి చేసుకోబోతుందని కూడా న్యూస్ వైరల్ అయింది. చివరకి అవన్నీ పుకార్లని తేలాయి.

సిమ్రాన్
సిమ్రాన్

ఆ తర్వాత లిస్టులో హీరో అబ్బాస్ చేరిపోయారు. వారు కలిసి కొన్ని సినిమాలు చేశారు. ఆ సమయంలో వారి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో అవన్నీ పుకార్లని సిమ్రాన్ కొట్టిపడేసింది. సిమ్రాన్ కోలీవుడ్ హీరో అజిత్ తో కలిసి వాలి సినిమాలో నటిస్తున్న టైంలో అతనితో ప్రేమలో పడిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలు ఇద్దరు ఖండించారు. ఆ తర్వాత అజిత్ షాలిని పెళ్లి చేసుకుని పుకార్లకు చెక్ పెట్టారు. ఇక తెలుగు లో బాలయ్యతో ఎక్కువ సినిమాల్లో నటించి ఆన్ స్క్రీన్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య ఏదో ఉందంటూ కొన్ని వార్తలు వచ్చాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here