Srinidhi Shetty : కేజీఎఫ్ హీరోయిన్ కి యాష్ లైంగిక వేధింపులు.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ కామెంట్స్

- Advertisement -

Srinidhi Shetty : నాలుకకి నరం లేకపోతే ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతారు అంటుంటారు పెద్దలు.అందుకు ఉదాహరణగా మనం నిజ జీవితం లో ఎంతో మందిని చూసాము, అలాగే సినీ ఇండస్ట్రీ లో కూడా కొంతమంది విమర్శకులు ఉంటారు.వీళ్ళని ఎవ్వరూ కూడా పట్టించుకోరు,మమల్ని ఎవ్వరూ పట్టించుకోలేదు అనే ఉక్రోషం తో హీరోల మీద , హీరోయిన్ల మీద లేని పోనీ నీచమైన నిందలు వేసి, జనాలతో తిట్టించుకొని , కనీసం ఇలా అయినా నలుగురి దృష్టిలో పడాలి అనే తాపత్రయం తో ఉంటారు.

అలాంటి వారిలో ఒకరు ఉమర్ సంధు.ట్విట్టర్ ని ఉపయోగించే ప్రతీ ఒక్కరికీ ఇతను ఎంత చీప్ వ్యక్తి అనేది తెలుసు.ఒకప్పుడు రీచ్ కోసం అన్నీ పాజిటివ్ వార్తలే వేసేవాడు,ఆ తర్వాత అవన్నీ గాలి వార్తలే అని తెలుసుకున్న నెటిజెన్స్ ఇతగాడిని పట్టించుకోవడం మానేసాడు.దాంతో అప్పటి నుండి ఈయన హీరోల మీద నిందలు వెయ్యడం ప్రారంభించాడు.అవి అత్యంత నీచం గా ఉన్నాయి.

Srinidhi Shetty
Srinidhi Shetty

ఇప్పుడు రీసెంట్ గా కన్నడ సూపర్ స్టార్ యాష్ మీద ఇతను చేసిన కామెంట్స్ అభిమానులకు చిర్రెత్తిపోయ్యేలా చేస్తుంది. KGF సిరీస్ షూటింగ్ జరుగుతున్న సమయం లో ఆ చిత్ర హీరోయిన్ ‘శ్రీనిధి శెట్టి‘ పై యాష్ లైంగిక వేధింపులు జరిపాడని, ఈ విషయాన్నీ ఆ హీరోయిన్ స్వయంగా తన వద్ద చెప్పుకొని బాధ పడింది అంటూ ఉమర్ సంధు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారింది.

- Advertisement -
yash srinidhi shetty

ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని ట్విట్టర్ వాడే ప్రతీ ఒక్కరికీ తెలుసు, కానీ ట్విట్టర్ వాడని వాళ్ళు మాత్రం ఇది నిజమే అని అనుకునే ప్రమాదం ఉంది. ఇలా అతనిని వదిలేస్తే అసత్య ప్రచారాలు చేస్తూ సెలెబ్రిటీల పేరు ప్రఖ్యాతలకు మచ్చ తీసుకొని రాగలరు. ఇప్పటికైనా ఇతని పై ఎవరో ఒకరు కఠిన చర్యలు తీసుకొని అతని ఆగడాలకు అడ్డుకట్ట వేస్తారని ఆశిద్దాము.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here