Kaikala Satyanarayana : కైకాల మరణంతో.. తెలుగు సినీలోకం హృదయం ముక్కలైంది

- Advertisement -

Kaikala Satyanarayana : టాలీవుడ్ నవరస నటనాశిఖరం కైకాల సత్యనారాయణ మరణం సినీ పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. ఆయన మరణంతో టాలీవుడ్ ఇండస్ట్రీ హృదయం ముక్కలయిందని సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కైకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. సత్యనారాయణ మృతికి సంతాపం ప్రకటిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

‘‘కైకాల సత్యనారాయణగారి మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో ఆయనకు స్నేహ సంబంధాలున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితం, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ – బాలకృష్ణ

‘‘సత్యనారాయణ గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ – రామ్‌చరణ్‌

- Advertisement -
Kaikala Satyanarayana
Kaikala Satyanarayana

‘‘తెలుగు సినీ పరిశ్రమలో నేను అభిమానించే నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. మన ఇంట్లో మనిషిలా ఆయన అందరితో కలిసిపోయేవారు. సినిమాల్లో ఆయన నటన అద్భుతం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ – నాని

‘‘సీనియర్ నటులు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మృతి విచారకరం. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ – నారా లోకేశ్‌

‘‘చిత్ర పరిశ్రమ మరో లెజెండ్‌ను కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు ఆయనకు సరిగ్గా నప్పేది. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన్ని వెండితెరపై మిస్‌ అవుతాం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా’’ – శ్రీనువైట్ల

‘‘విభిన్న పాత్రల్లో నటించి, తన విలక్షణ నటనతో అభిమానుల చేత నవరస నటనా సార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్‌గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ. ఆయన మరణం సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’  

 – టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు

Ravi Teja on Twitter: “Grief-stricken by the demise of the legendary actor Kaikala Satyanarayana garu. He is One of the finest actors Indian cinema has ever seen. My sincere condolences to his family & dear ones. Om Shanti 🙏” / Twitter

Sai Dharam Tej on Twitter: “Woke up to this terrible news and saddened at the demise of Legendary Actor Kaikala Satya Narayana Garu. You’re a stalwart of versatility and your work will always inspire generations to come. End of an era 🙏 May your soul rest in peace. #RIPKaikalaSatyanarayana Garu” / Twitter

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here