Kaikala satyanarayana : తెలుగు వెండి తెరకు బంగారు నటనా నిధి కైకాల..మరపురాని అనుభూతి..Kaikala satyanarayana : కైకాల సత్యనారాయణగారు.. తెలుగు సినిమా పుట్టిన తర్వాత నాలుగేళ్ళకు ఆయన జన్మించారు.. నటుడుగా రెండేళ్ళ క్రితం షష్ఠిపూర్తి చేసుకున్నారు..ఈయన 1931లో తొలి తెలుగు టాకీ సినిమా భక్తప్రహ్లాద విడుదల అయ్యింది..ఇక 1935 జులై 25న కైకాల జన్మించారు.. 1959లో ఆయన నటించిన తొలి సినిమా ‘సిపాయి కూతురు ‘ విడుదలయింది..ఈ విధంగా చూసుకుంటే.. ఆయన నటనా ప్రస్తానంకు 63 సంవత్సరాలు కాగా.. వ్యక్తిగతంగా ఈ ఏడాది జులై 25కి 86 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. తెలుగు సినిమా అభిమానులు అందరికీ సత్యనారాయణ జీవిత చరిత్ర సినిమా విశేషాలు తెలిసినవే. అయినా ఒకసారి గుర్తు చేసుకుందాం..

kaikala satyanarayana
kaikala satyanarayana


హీరోగా సినిమా రంగానికి మొదట పరిచయం అయినా.. ఆ సినిమా నిరాశపర్చడంతో విలన్గా మారడానికి ముందుకు వచ్చారు కైకాల..జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఎన్నెన్నో జానపద చిత్రాల్లో సత్యనారాయణ విలన్ పాత్రలు పోషించారు. ఆ తర్వాత సోషల్ పిక్చర్స్లో కూడా విలన్ పాత్రలు వచ్చాయి. సత్యనారాయణ నవ్వు పాపులర్ విలనీ ట్రేడ్ మార్క్ అయింది. కెరీర్ మొదటిలోనే ఆయనకి పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించింది. లవకుశలో భరతుడిగా.. శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా.. నర్తనశాలలో దుశ్శాసనుడిగా నటించారు. శ్రీకృష్ణపాండవీయంలో ఘటోత్కచుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్ళీ 1995లో ఎస్.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘటోత్కచుడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.

ఆ సినిమా ఆయనకు మంచి పేరు తో పాటు అవార్డులను కూడా అందించింది..

శ్రీకృష్ణావతారం చిత్రంలో తొలిసారి దుర్యోధనుడి పాత్ర లో చేశారు. ఆ తర్వాత కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా అద్భుతంగా రక్తి కట్టించారు. రావణాసురుడిగా సీతాకళ్యాణంలో.. భీముడిగా దానవీరశూరకర్ణలో.. మూషికాసురుడిగా శ్రీ వినాయక విజయం చిత్రాల్లో నటించారు. చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది.. కథానాయిక మొల్లలో శ్రీకృష్ణదేవరాయలు పాత్ర పోషించారు. యమధర్మరాజు అంటే తెలుగు తెరకి సత్యనారాయణ తప్ప మరొకరు గుర్తురారు.

అదే పాత్రలో రెండు మూడు సినిమాలు కూడా చేశారు..

actor kaikala satyanarayana

యమగోల సినిమాతో ప్రారంభమైన ఆయన జీవితం.. యముడికి మొగుడు.. యమలీల.. రాధామాధవ్.. దరువు చిత్రాల వరకూ సాగింది. మోసగాళ్ళకు మోసగాడు, దొంగల వేట తదితర చిత్రాల్లో ఆయన విలన్ పాత్రలు మర్చిపోలేనివి.ఉమ్మడి కుటుంబం.. దేవుడు చేసిన మనుషులు.. శారద చిత్రాలతో పాటు సాదారణ జీవిత పాత్రలను కూడా ఆయన చేశారు..మన మాటలో చెప్పాలంటే..మల్టీ టాలెంటేడ్..ఏ పాత్రలో అయిన జీవిస్తారు కైకాల..

తాత..మనవడు, సంసారం..సాగరం, రామయ్య తండ్రి, జీవితమే ఒక నాటకరంగం, దేవుడే దిగివస్తే, సిరిసిరి మువ్వ, తాయారమ్మ బంగారయ్య, పార్వతీ పరమేశ్వరులు మొదలైన చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించి.. కుటుంబ ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన జీవితం అంతం లేని సినీ సముద్రం అనే చెప్పాలి..నా పేరే భగవాన్.. ముగ్గురు మూర్ఖులు.. ముగ్గురు మొనగాళ్ళు.. కాలాంతకులు.. గమ్మత్తు గూడచారులు.. తూర్పు పడమర.. సావాసగాళ్ళు లాంటి చిత్రాల్లో హీరోతో సమాంతరమైన పాత్రలు పోషించారు సత్యనారాయణ.చాణక్య చంద్రగుప్తలో రాక్షసమంత్రిగా న భూతో న భవిష్యత్ అన్నట్లు నటించారు. నా పిలుపే ప్రభంజనంలో ముఖ్యమంత్రి పాత్రతో విస్మయపరిచారు.  తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్లతో కొన్ని చిత్రాలతో పాటుగా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ గారు నటించడం జరిగింది.

actor

కైకాల సత్యనారాయకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డ్తో గౌరవించుకుంది. ఆ మధ్య విడుదలయిన మహర్షి చిత్రంలో కూడా నటించారు సత్యనారాయణ. తను నటించిన ప్రతీ పాత్రా తన సొంత బిడ్డలాగే భావించి.. వాటికి ప్రాణ ప్రతిష్ట చేశారు..ఇలా ఒక్క సినిమా గురించి అయితే రాయగలం..కానీ ఇలా వందల చిత్రాల గురించి రాయడం కష్టమే..ఏది ఏమైనా ఆయన సినీ ప్రస్థానం తెలుగు చిత్ర పరిశ్రమకు మరపురాని అనుభూతి..అలాంటి ఆయన గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యం తో భాధ పదుతున్నారని తెలుస్తుంది..ఈరోజు ఉదయం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు..ఆయన మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు..ఇలాంటి నటుడు మళ్ళీ పుట్టరు..మీ లాంటి మంచి మనిషి ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటూన్నాము కైకాల సత్యనారాయణ గారు..