Sreemukhi : చీరకట్టులో కుందనపు బొమ్మ.. బుల్లితెర రాములమ్మ

- Advertisement -

బుల్లితెర రాములమ్మ.. అదేనండి యాంకర్ శ్రీముఖి. ప్రస్తుతం తెలుగు టెలివిజన్​లో సూపర్​ బిజీగా ఉన్న యాంకర్ Sreemukhi . ఇతర యాంకర్లు కాస్త బుల్లితెరను వదిలి వెండితెరపై కాన్సంట్రేషన్ చేస్తుండటంతో ఈ బ్యూటీ స్మాల్ స్క్రీన్​పై జోరందుకుంది. వరుస అవకాశాలు అందుకుంటూ నాలుగు ఛానెళ్లలో తన సత్తా చూపిస్తోంది.

సుమ తర్వాత ఇలా అన్ని ఛానెళ్లలో సత్తా చాటుతున్న ఏకైక యాంకర్ శ్రీముఖే అని చెప్పుకోవచ్చు. ఓ వైపు నాలుగైదు షోలు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు వరుస ఫొటో షూట్లతో అటు బుల్లితెరపై, ఇటు సోషల్‌ మీడియాలో తన జోష్ చూపెడుతోంది.

Sreemukhi
Sreemukhi

ఆహాలో డ్యాన్స్ ఐకాన్, మా టీవీలో స్టార్ మా పరివార్, కామెడీ స్టార్స్, సారంగ ధరియా, జీ తెలుగులో సరిగమప, ఈటీవీలో ఒకరికొకరు షోలతో ఫుల్ బిజీగా గడిపేస్తోంది రాములమ్మ. ఈ షోలలో శ్రీముఖి యాంకరింగే హైలెట్​గా నిలుస్తోంది. ముఖ్యంగా తను ధరించే దుస్తులకు షోలో జడ్జిలు, కంటెస్టులతో పాటు ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు

- Advertisement -

డ్యాన్స్ ఐకాన్, కామెడీ స్టార్స్ వంటి ప్రోగ్రామ్స్​కు ట్రెండీ, మోడ్రన్ దుస్తుల్లో ఎంట్రీ ఇస్తోంది శ్రీముఖి. ముఖ్యంగా డ్యాన్స్ ఐకాన్ ఓటీటీ షో కావడంతో గ్లామర్ డోస్ కాస్త ఘాటుగానే పెంచేస్తోంది. ఈ షోకు హాట్ డ్రస్సులో వస్తూ యువతను ఫిదా చేస్తోంది.

 

మరోవైపు స్టార్ మా పరివార్, ఒకరికొకరు షోలలో మాత్రం ట్రెడిషనల్ వేర్​తో సందడి చేస్తోంది. ముఖ్యంగా ఒకరికొకరు ప్రోగ్రామ్​లో చీరకట్టులో మైమరిపిస్తోంది. ఈ షోలో శ్రీముఖి డ్రెస్సింగ్ చాలా అందంగా కనిపిస్తోంది. ఓవైపు హాట్​గా కనిపిస్తూనే మరోవైపు క్యూట్​నెస్​తో కుర్రకారు మనసు దోచేస్తోంది. తాజాగా.. ఈ షోకు సంబంధించిన ఫొటోషూట్​ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది శ్రీముఖి.

 

ఈసారి కాస్త కొత్తగా చీరలో దర్శనం ఇచ్చింది ఈ స్టార్ యాంకర్. నిండుగా చీర కట్టుకుని బాపూబొమ్మలా రెడీ అయింది. లైట్ బ్లూ కలర్ సారీలో శ్రీముఖి అందం చూసి కుర్రాళ్లు మనసుపారేసుకుంటున్నారు. అందం అమ్మాయైతే నీలా ఉందా అన్నట్టుందే అంటూ పాటలు కూడా పాడేసుకుంటున్నారు. మరీ నాజూగ్గా కాకుండా కాస్త బొద్దుగా ముద్దుగా ఉన్న రాములమ్మని చూసి యువకులు ఫిదా అవుతున్నారు.

ఇక యాంకరింగే కాదు తన టైమింగ్, పంచ్​లతో సూపర్ ఎంటర్​టైన్మెంట్ ఇస్తుంది శ్రీముఖి. ఎదుటివాళ్లపై పంచులు వేయడమే కాదు వాళ్లు వేసిన పంచులను కూడా స్పోర్టివ్​గా తీసుకుంటుంది. ఎవరైనా హద్దులు మీరితే నెమ్మదిగా పంచ్ వేస్తూనే వాళ్లకి బుద్ధి చెబుతుంది. ఇదే శ్రీముఖిని ఇతర యాంకర్లకు భిన్నంగా నిలబెట్టే పాయింట్.

 

ఇక గతంలో బిగ్ బాస్ షోలో మెరుపులు మెరిపించింది శ్రీముఖి. తన అందం, ఎంటర్​టైన్మెంట్​, గేమ్ ప్లానింగ్​తో ఆ షో రన్నరప్​గా నిలిచింది. ఫిజికల్ టాస్క్​లలో రెచ్చిపోయి రచ్చ చేసింది. షో విన్నర్ కాలేకపోయినా బిగ్​బాస్ చూసిన ప్రతి ఒక్కరి మనసును మాత్రం గెలుచుకుంది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తరువాత చాలా కాలం ఖాళీగానే ఉంది శ్రీముఖి. సరైన షోలు లేక ఆఫర్లు లేక ఇబ్బంది పడింది. ఇక శ్రీముఖి పని అయిపోయింది లే అనుకున్న సమయంలో కాస్త లావు తగ్గి మళ్లీ స్ట్రాంగ్ కమ్​బ్యాక్ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here