Nora Fatehi : సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నోరా ఫతేహి పరువాలు

- Advertisement -

బాలీవుడ్ హాట్​ బ్యూటీ Nora Fatehi . ఈ పేరుకు నార్త్​లోనే కాదు ఇటు సౌత్​లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నోరాను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారిలో కుర్రకారే ఎక్కువ. కెనడాకు చెందిన ఈ హాట్ బాంబ్‌ కంటి చూపుతో కుర్రాళ్ల‌ని అలా క‌ట్టిప‌డేస్తోంది. ఈ మల్టీటాలెంటెడ్​ భామ.. మోడ‌ల్​గా కెరీర్​ను స్టార్ట్ చేసి.. స్పెషల్​ సాంగ్స్​ డ్యాన్సర్,​ సింగర్​, నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సోషల్​మీడియాలోనూ చురుగ్గా ఉంటోంది. మోడ్రన్​ డ్రెసుల్లో ఫొటోలకు పోజులిస్తూ వాటిని సోషల్​మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది.

ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్​ అయినా.. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న కథానాయిక అయినా సోషల్ మీడియాలో పరువాలు వడ్డించాల్సిందే. అలా సోషల్ మీడియాలో క్లిక్ అయి కుర్రకారును తమ సొగసుల మాయలో పడేయాల్సిందే. ఇందులో నోరా ఆరితేరింది. అదిరిపోయే సొగసులతో ఘాటు పోజులతో.. మత్తెక్కించే చూపులతో యువకుల గుండెల్లో హీట్ పుట్టిస్తోంది ఈ బ్యూటీ.

Nora Fatehi
Nora Fatehi

2014లో వచ్చిన రోగ్ టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్ అనే మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది నోరా. ఆ తర్వాత హీరోయిన్​ పాత్రలకన్నా ఐటమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్​తోనే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్​తో కలిసి ఆడిపాడింది నోరా.

- Advertisement -

ఆ తర్వాత రవితేజ కిక్​2 లోనూ, మెగా హీరో వరుణ్ తేజ్ సినిమాలోనూ నోరా స్పెషల్ సాంగ్స్ చేసింది. బాహుబలి మూవీలో మనోహరి పాటతో మత్తెక్కించింది. బాలీవుడ్​లో ఇప్పటివరకు డజనుకు పైగా స్పెషల్ సాంగ్స్ చేసింది. ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేస్తే ఆ మూవీ హిట్ అవ్వాల్సిందే.

ఇటీవల ఈ భామ ఓ కేసులో కూడా ఇరుక్కుంది. 200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్‌ చంద్రశేఖర్‌ నుంచి ఆమె అందుకున్న ఖరీదైన బహుమతులు, ఇతర ఆర్థిక పరమైన లావాదేవీలు జరిపినట్లు ఈమెపై ఆరోపణలు ఉన్నాయి.

సోషల్ మీడియాలో తన అందంచందాలతో కుర్రకారుకు హీట్ పుట్టిస్తున్న నోరా తన డ్యాన్స్​తో కట్టిపడేస్తుంది. ముఖ్యంగా గర్మీ సాంగ్​లో ఆమె పర్ఫామెన్స్​కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హాయ్ గర్మీ అంటూ ఆ సాంగ్​లో నోరా స్టెప్పులు కుర్రకారుకు కైపెక్కించాయి. తాజాగా నోరా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతున్నాయి. ఫిఫా వరల్డ్ కప్​ క్లోజింగ్ సెర్మెనీలో నోరా డ్యాన్స్ పర్ఫామెన్స్ ఉంటుందనే న్యూస్ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here