Saiee M Manjrekar : సోషల్ ప్రపంచంలో సయీ సొగసులు

- Advertisement -

తెలుగు వెండితెరకు పరిచయమైన మరో ఉత్తరాది సోయగం సయీ మంజ్రేకర్​. నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె Saiee M Manjrekar . బ్యాక్​గ్రౌండ్​తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఈ బ్యూటీకి అవకాశాలు తక్కువే. 2012లో కక్స్​పర్ష్​ అనే మరాఠీ మూవీతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్​ సూపర్ హిట్ మూవీస్​లో ఒకటై దబంగ్ సీక్వెల్​లో నటించింది.

బాలీవుడ్ స్టార్​ హీరోతో హిందీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసినా ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ బావ ఆయుశ్ శర్మతో కలిసి మాంజా అనే వీడియో సాంగ్​లో నటించింది. దీని తర్వాత సయీకి బాలీవుడ్​లో అవకాశాలేం లేవు.

 

- Advertisement -

బాలీవుడ్ వద్దనుకున్న సయీని టాలీవుడ్ కాస్త అక్కున చేర్చకుంది. తెలుగులో వరణ్ తేజ్​తో కలిసి గని మూవీ చేసింది. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఆ తర్వాత అడవి శేశ్​తో కలిసి మేజర్​లో నటించింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, ఇతర భాషల్లో బ్లాక్​బస్టర్ టాక్ సంపాదించుకుంది. మూవీ హిట్​ అయినా సయూకి ఆఫర్స్ మాత్రం రాలేదు.

సయూకి సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, ప్రియాంకా చోప్రా అంటే చాలా ఇష్టమట. ఈ బ్యూటీకి ట్రావెలింగ్ అంటే పిచ్చి. ఇంకా ఈ భామకు ముక్క లేనిదే ముద్ద దిగదట. నోరు కట్టేసుకోకుండా ఇష్టమైనవన్నీ తినేసి కాసేపు జిమ్​లో వ్యాయామం చేస్తుందట.

 

బాలీవుడ్​లో అవకాశాలేం రాకపోవడం వల్ల ప్రస్తుతం టాలీవుడ్​లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉందట ఈ బ్యూటీ. అందుకే తెలుగు భాషపై పట్టు సంపాదించే ప్రయత్నం చేస్తోందట. ఇక తెలుగు ఇండస్ట్రీలో రాణించాలంటే తన తండ్రి మహేశ్ మంజ్రేకర్ కొన్ని సూచలు చెప్పారట. డైలాగ్‌ ఏంటి? దాన్ని ఎలా.. ఏ ఎక్స్‌ప్రెషన్‌తో పలకాలి? ఇలా ప్రతిదానిపైనా జాగ్రత్తగా దృష్టి పెట్టమన్నారట. పదాల్ని ఈజీగా నేర్చుకోవడం, పలకడం ఎలాగో చిన్న చిన్న టిప్స్‌ కూడా ఇచ్చారట.

 

తెలుగు నేర్చుకోవడానికి ముందు ఓ సహాయకుడ్ని పెట్టుకుని సయీ.. డైలాగ్స్‌ని ప్రాక్టీస్‌ చేసేదట. ఆ తర్వాత నెమ్మదిగా సెట్​లో ఉన్న వారితో మాట్లాడటం అలవాటు చేసుకుందని అంటోంది. తండ్రి స్టార్ యాక్టర్ అన్న ఒత్తిడి తనపై ఏం లేదని..అదొక బాధ్యతలా భావిస్తున్నానని చెబుతోంది ఈ ఉత్తరాది అమ్మడు. నటుడిగా తన తండ్రికి తెలుగులో మంచి పేరుందని.. తనలాగే సొంతంగా ప్రతిభతో నటిగా మంచి గుర్తింపు సాధించుకోవాలనుకుంటున్నానని చెబుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here