Balakrishna : బాలయ్యకు షాక్ ఇచ్చిన తారక్ ఫ్యాన్స్..గుడ్ న్యూస్ చెప్పబోతాడా?

- Advertisement -

Balakrishna : తెలుగు హీరో నటసింహం నందమూరి బాలయ్య ఇప్పుడు ఫుల్ బిజిగా ఉన్నారు..అటు వరుస సినిమాలతో ఇటు షో తో నే కాదు..రాజకీయాల్లో కూడా బాలయ్య దూకుడును వ్యవహరిస్తున్నారు.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి షూటింగ్ ను పూర్తి చేశారు బాలయ్య. అలాగే ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ను కూడా మొదలు పెట్టేశారు. ఇదిలా ఉంటే మరో వైపు అన్ స్టాపబుల్ షో ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు బాలయ్య. ఇక అన్ స్టాపబుల్ షో సీజన్ వన్ ఇప్పటికే సక్సెస్ టాక్ తో పూర్తి చేసిన బాలయ్య ఇప్పుడు సీజన్ 2 ని కూడా అదే ఎనర్జీ తో ఇప్పుడు సీజన్ 2ని రన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ షోకు యంగ్ హీరోలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యి సందడి చేశారు. ఇక రీసెంట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ కూడా అన్ స్టాపబుల్ కు హాజరయ్యాడు. తన మిత్రుడు గోపీచంద్ తో కలిసి ప్రభాస్ అన్ స్టాపబుల్ కు హాజరయ్యాడు.

nandhamuri balakrishna

త్వరలోనే ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో మా అభిమాన హీరోను ఎప్పుడు ఈ షోకు పిలుస్తారని ప్రశ్నిస్తున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. బాలయ్య షోకు తారక్ రావాలని ఆయన అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు..ఈ విషయం పై గతంలో కూడా నందమూరి ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తుంది.

- Advertisement -

తారక్ తో కలిసి బాలయ్య బాబు సందడి చేస్తే చూడాలని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు మా హీరోని బాలయ్య షోకి ఎప్పుడు పిలుస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక మేరకు తారక్ త్వరలోనే అన్ స్టాపబుల్ కు గెస్ట్ గా వస్తాడా.. లేదా చూడాలి.. ఇప్పుడు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది… ఈ సినిమాలో బాలయ్య సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. అటు కొరటాల శివ డైరెక్షన్లో సినిమా చెయ్యనున్నారు..ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here