Bigg Boss Winner : బుల్లి తెరపై ప్రసారం అవుతున్న అన్ని షో లు మంచి టాక్ తో దూసుకుపోతున్నాయి. అందులో టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో బిగ్ బాస్..ఈ షో గురించి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా సక్సెస్ తో దూసుకుపోతుంది. దేశంలో ఏ షోకూ రాని రేటింగ్ వచ్చింది. దాంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ ప్రసారం చేస్తున్నారు. ఇందులో విజేతను నిర్ణయించే ఫినాలే వీక్ ఓటింగ్ వివరాలు వివరాలు బయటకు వచ్చాయి. ఎవరికీ ఓటింగ్ ఎక్కువగా ఉందో ఇప్పుడు చూడండి..
ఐదు సీజన్లలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. దీంతో షో చరిత్రలోనే తొలిసారి ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి అడుగు పెట్టారు. అందులో రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఉన్నారు. వీళ్లంతా చివరి వారం విజేతను నిర్ణయించే ఓటింగ్‌లో నిలిచారు.వీరిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య హౌస్ నుంచి బయటకు వచ్చింది.. ప్రస్తుతం ఐదు మంది మాత్రమే హౌస్ లో ఉన్నారు..
బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారి ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలే వీక్‌లోకి పంపించారు. అయితే, వీళ్లలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని హోస్ట్ నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌లో వెల్లడించాడు. ఇందులో భాగంగానే గత ఎపిసోడ్‌లో శ్రీ సత్య షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది.ఇప్పుడు చివరిగా రేవంత్, శ్రీహాన్, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఫినాలేకు చేరారు..
ఇకపోతే ఆరో సీజన్‌లో రేవంత్ మాత్రమే ఆరంభం నుంచే తనదైన ఆటతీరుతో టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలోనే ఫినాలే వీక్‌లోనూ అతడికే ఎక్కువ ఓట్లు వచ్చాయని తాజాగా ఓ న్యూస్ లీకైంది. ఫలితంగా ఈ సీజన్‌కు రేవంత్ విజేతగా నిలవబోతున్నాడని సమాచారం. ఇప్పటికే అతడికి కంగ్రాట్స్ అంటూ చెబుతూ చాలా మంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు..మరికొంతమంది అతనే విన్నర్ అని కం ఫార్మ్ చేశారు..
ఓటింగ్‌లో రేవంత్ విజేతగా నిలుస్తాడని అందరికీ ముందే అర్థమైపోయింది. అయితే, రన్నర్ విషయంలో మాత్రం చాలా చర్చలు జరిగాయి. అయితే, అందుతున్న సమాచారం ప్రకారం.. మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న శ్రీహాన్ ఈ సీజన్‌లో రన్నర్‌గా నిలవబోతున్నాడట.. అంటే రేవంత్ తర్వాత స్ట్రాంగ్ శ్రీహాన్ అనే టాక్ వినిపిస్తోంది.ఈ సీజన్ ఫినాలే వీక్ పోలింగ్ ముగిసిన తర్వాత ఆది రెడ్డి మూడో స్థానంలో, కీర్తి భట్ నాలుగో స్థానంలో, రోహిత్ ఐదో స్థానంలో నిలిచారని తెలిసింది.. రేపు ఆ చివరి ఇద్దరిని ఎలిమినేట్ అవుతారని తర్వాత విన్నర్ గురించి చెబుతారు..స్పెషల్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రావొచ్చునని సమాచారం..