Tamannaah : బ్లాక్ అండ్ వైట్ డ్రెస్​లో మిల్కీ బ్యూటీ తమన్నా గ్లామర్ ట్రీట్టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా Tamannaah తెలుగులో తాజాగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాను కన్నడ నటుడు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్​టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రంలో సత్యదేవ్​తో కలిసి రొమాన్స్ చేసింది తమన్నా. హైదరాబాద్​లో ఈ మూవీ ప్రమోషన్స్​లో తమన్నా పాల్గొంది.

Tamannaah Black and white dress Photos
Tamannaah Black and white dress Photos

ఈ ఈవెంట్​లో తమన్నా బ్లాక్ అండ్ వైట్ డ్రెస్​లో మెరిసిపోయింది. 30 ఏళ్ల వయసొచ్చినా ఈ మిల్కీ బ్యూటీ అందం ఏ మాత్రం తగ్గలేదు. పైగా రోజురోజుకు మరింత అందంగా తయారవుతోంది. ఈ బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లయింది. 18 ఏళ్లలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించింది.

Tamannaah Black and white dress Stills

టాలీవుడ్​ను ఒక ఊపు ఊపేసిన తమన్నా చూపు ఇప్పుడు బాలీవుడ్​పై పడింది. గుర్తుందా శీతాకాలం తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా తెలుగు సినిమా ఆఫర్లేం లేవు. బాలీవుడ్​లో మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ సినిమాలతో ఇటీవలే ముంబయి ప్రేక్షకులను అలరించింది.

Tamannaah Black and white dress Images

తమన్నా ఈ యేడాది వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 3’ లో మరోసారి వెంకటేశ్ సరసన మెరిసింది. ఇక చిరంజీవి హీరోగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో భోళా శంకర్ మూవీలోనూ తమన్నా నటిస్తోంది.

Tamannaah Photos

మరో రెండేళ్ల వరకు పెళ్లి ఆలోచన లేదని క్లియర్​గా చెప్పేసింది. నిజానికి ఆమెకి అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో సంబంధాలు కూడా చూశారు. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ ఊహించని విధంగా టర్న్ తీసుకుంది. ఒక్కో సినిమాకి రూ.1.5 నుంచి రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది.