Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సలార్’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులంతా పాటుగా, ఆడియన్స్ కూడా ఎంతలా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. టీజర్ లో చెప్పిన డైలాగ్ ప్రకారమే, ఈ చిత్రం ముందు ఎవరు వచ్చినా డైనోసర్ ముందు చిట్టి ఎలుక నిల్చున్నట్టే అనే రేంజ్ లో హైప్ ఉండేది.

కానీ ఎప్పుడైతే సెప్టెంబర్ 28 వ తారీఖు నుండి డిసెంబర్ 22 కి ఈ చిత్రం వాయిదా పడిందో అప్పటి నుండి ఈ సినిమా మీద ఉన్న అంచనాలు పడిపోయాయి. రీసెంట్ గా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కూడా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని అంతగా ఆకట్టుకోలేదు. కానీ మొన్న విడుదలైన సూరీడు లిరికల్ వీడియో సాంగ్ కి మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు, సెంటిమెంట్స్ మరియు ఎమోషన్స్ కూడా వేరే లెవెల్ లో ఉంటుంది అని అనిపించేలా చేసింది ఈ సాంగ్.

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన దుబాయి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. అక్కడి సెన్సార్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ఏమిటంటే ‘సలార్’ ఫస్ట్ హాఫ్ మొత్తం క్యారెక్టర్స్ బిల్డప్ పై డైరెక్టర్ ఎక్కువగా ద్రుష్టి సారించాడట. ప్రభాస్ ఎంట్రీ ఆలస్యం గా ఉంటుంది అట, కానీ ఆయన ఎంట్రీ తర్వాత నుండి ఇంటర్వెల్ సన్నివేశం వరకు సినిమా వేరే లెవెల్ లో ఉంటుందని దుబాయి నుండి వినిపిస్తున్న టాక్.

అయితే సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ రేంజ్ లో లేదని, ఫ్యాన్స్ ఒక మూమెంట్ లో ఎటు నుండి ఎటు వెళ్తుంది స్టోరీ అనే విధంగా ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. మరి విడుదల తర్వాత కూడా ఇదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటుందా లేదా పాజిటివ్ రెస్పాన్స్ ని సొతం చేసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.