Lokesh Kanakaraju : నా కెరీర్ లో ‘లియో’ చిత్రం ఒక చేదు జ్ఞాపకం అంటూ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Lokesh Kanakaraju : ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై ఆ అంచనాలను అందుకోలేకపోయిన సినిమాలలో ఒకటి తమిళ హీరో విజయ్ నటించిన ‘లియో’. ఈ చిత్రం కంటెంట్ పరంగా మాత్రమే అంచనాలను చేరుకోలేకపోయింది కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం కాదు. కలెక్షన్స్ పరంగా అయితే ఈ సినిమాకి ఒక ఇండస్ట్రీ హిట్ కి ఎలాంటి వసూళ్లు అయితే వస్తాయో, అలాంటి వసూళ్లు ఈ సినిమాకి వచ్చాయి.

Lokesh Kanakaraju
Lokesh Kanakaraju

విజయ్ కి ఉన్న క్రేజ్, దానికి తోడు లోకేష్ కనకరాజ్ లాంటి సెన్సేషనల్ డైరెక్టర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం, దసరా పండుగ సెలవలు తమిళనాడు లో వరుసగా ఆరు రోజులు రావడం తో ఆ ఆరు రోజుల్లోనే సినిమాకి రావాల్సిన వసూళ్లు మొత్తం వచ్చేసాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా చేరుకుంది, కానీ కంటెంట్ పరంగా చూస్తే మాత్రం అంచనాలను రీచ్ అవ్వలేదు అనేది అక్షర సత్యం.

Vijay thalapathy

ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా , సెకండ్ హాఫ్ అనుకున్న స్థాయిలో లేకపోవడం వల్లే ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నిరాశకి గురి అయ్యారు. అయితే ఈ సినిమా గురించి లోకేష్ కనకరాజ్ రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో లియో చిత్రం గురించి పలు కీలక వ్యాఖ్యలు చేసాడు.

- Advertisement -
Leo movie

ఆయన మాట్లాడుతూ ‘ఆడియన్స్ సెకండ్ హాఫ్ బాలేదు అని చెప్తూ వచ్చారు ,వాళ్ళ అభిప్రాయం ని నేను గౌరవిస్తున్నాను. వాళ్ళు చెప్పినట్టుగానే నిజంగానే సెకండ్ హాఫ్ బాగా రాలేదు. నేను ముందుగా విడుదల తేదీలను ప్రకటించడం వల్లే ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యింది అనుకుంటున్నాను. విడుదల తేదీ దగ్గర పడుతుండేలోపు ఏమి చేస్తున్నానో, ఏమి తీస్తున్నానో క్లారిటీ లేకుండా పోయింది. ఇక నుండి రాబొయ్యే సినిమాలకు విడుదల తేదీ ప్రకటించను’ అంటూ చెప్పుకొచ్చాడు లోకేష్ కనకరాజ్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here