Prabhas : రాజమౌళి కి ప్రశాంత్ నీల్ కి ఉన్నంత టాలెంట్ లేదు అంటూ ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Prabhas : టాలీవుడ్ తో పాటుగా బాలీవుడ్ , కోలీవుడ్ మరియు శాండిల్ వుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సలార్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో చేసిన ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎలా అయినా ఈ సినిమాతో ప్రభాస్ భారీ హిట్ కొట్టాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

Prabhas
Prabhas

కాబట్టి ఈ సినిమా కచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రాలేదు కానీ, మొన్న విడుదల చేసిన సూరీడు అనే లిరికల్ వీడియో సాంగ్ కి మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రొమోషన్స్ కూడా గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ప్రభాస్ పలు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు.

salaar Movie

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘నేను ఇప్పటి వరకు ఇండస్ట్రీ కి వచ్చి 20 ఏళ్ళు దాటింది. కానీ నా కెరీర్ లో ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ ని నేను ఎప్పుడు చూడలేదు. నా కెరీర్ లో బెస్ట్ డైరెక్టర్ ఎవరు అని అడిగితే కచ్చితంగా ప్రశాంత్ నీల్ పేరే చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -
Prabhas Prashanth Neel

దీనిపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ప్రభాస్ రాజమౌళి తో మూడు సినిమాలు చేసాడు. ఆయన కెరీర్ ఈరోజు ఇలా ఉందంటే దానికి రాజమౌళి కారణం. అలాంటిది నా కెరీర్ లో బెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అని చెప్పాడంటే, రాజమౌళి ప్రశాంత్ నీల్ కంటే తక్కువే అని కదా ప్రభాస్ దృష్టిలో అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here