Sushmita Sen : హ్యాపీ బర్త్ డే టూ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్

- Advertisement -

అందాల కిరీటం అందుకున్న బ్యూటీస్ ఎంతో మంది ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే ప్రత్యేకం. భారతదేశానికి తొలి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తీసుకొచ్చిన సుస్మితా సేన్ చాలా ప్రత్యేకం. అందాల పోటీల్లో రాణించి ఆ తర్వాత హీరోయిన్ గా తెరంగేట్రం చేసి ఓవైపు వ్యాపారవేత్తగా మరో వైపు తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తోంది సుస్మితా. ఇవాళ తన బర్త్ డే సందర్భంగా సుస్మితకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం..

ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా ఇప్పటికీ సుస్మితా అందం చెక్కుచెదరలేదు. ఫిట్ గా ఉండే బాడీ.. ఆకట్టుకునే చిరునవ్వుతో ఇప్పటికీ యువత మనసు కొల్లగొట్టేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ లో స్పీడ్ పెంచి డిజిటల్ స్క్రీన్ పై దూసుకెళ్తోంది. 2015లో నిర్ బాక్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సుస్మిత మళ్లీ తిరిగి వెనక్కి చూసుకోలేదు.

Sushmita Sen
Sushmita Sen

పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే అయినా తన మూలాలు మాత్రం బెంగాల్ వి. తండ్రి సుభేర్ సేన్ ఇండియన్ నేవీలో వింగ్ కమాండర్. ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. తల్లి శుభ్రా సేన్ జ్యువెల్లరీ డిజైనర్. సుస్మితాకు నీలమ్, రాజీవ్ అనే ఇద్దరు సోదరులున్నారు. 15 ఏళ్ల వయసులోనే అందాల ప్రపంచంలో అడుగుపెట్టిన సుస్మిత స్కూల్ ఉన్నప్పుడే బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొనేది. ఆ తర్వాత 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకుంది.

- Advertisement -

దస్తక్ అనే సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో కలిసి రక్షకుడు అనే మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. అయినా సుస్మితకు వరుస అవకాశాలు వచ్చాయి. సిర్ఫ్ తుమ్ మూవీ సుస్మితాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత బీవీ నెం1 ఇచ్చిన కిక్కుతో ఇక తనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇక రక్షకుడుతో టాలీవుడ్ లో కనుమరుగై పోయిన సుస్మితా.. షకలక బేబీ షకలక బేబీ లుక్కులివ్వ తోచలేదా అంటూ ఒకే ఒక్కడు మూవీలో చేసిన సందడి ఇప్పటికీ ప్రతి తెలుగు ప్రేక్షకుడి మదిలో చెక్కు చెదరకుండా నిలిచిపోయింది. అందంలో సుస్మితకు ఎవరూ తీసిపోరు అనేది ఇప్పటికే రుజువైంది. కానీ బాహ్య అందంతో పాటు ఆమె మనసు అంతకంటే అందమైంది.

25 ఏళ్ల వయసులోనే రీనీ అనే చిన్నారిని దత్తత తీసుకుని తల్లయింది. పెళ్లి చేసుకోకుండా పిల్లలకు రక్షణ కల్పించలేదన్న అభ్యంతరంపై ఆమె కోర్టులో పోరాడి మరీ రీనీని దత్తత తీసుకుంది. సొంత తల్లి కూడా అలా చూసుకోలేదమో అనిపించలేనంత ప్రేమను కురిపించింది. 2010లో అలీషా అనే మరో పాపను దత్తత తీసుకుంది. ఈ ఇద్దరు పిల్లలే తన లోకంగా బతుకుతోంది సుస్మిత.

తన రిలేషన్ షిప్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవలే ఇరువురు ప్రకటించినా ప్రస్తుతం వీళ్లిద్దరు దూరంగా ఉంటున్నారని సమాచారం. అంతకుముందు రోహ్మన్ సాల్ అనే వ్యక్తితో సుస్మిత ఏడాదికి పైగా డేటింగ్ చేసింది. వయసులో సుస్మిత కంటే రోహ్మన్ దాదాపు 15 ఏళ్లు చిన్నవాడు. అప్పట్లో ఈ విషయం పెను దుమారం రేపింది. కానీ వీళ్లిద్దరు చాలా ప్రేమగా ఉండేవారు.

కానీ కొంత కాలం కింద వీళ్లు విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. స్నేహితులుగానే మా ప్రయాణం మొదలైంది.. స్నేహితులుగానే విడిపోయింది అంటూ సోషల్ మీడియాలో తమ బ్రేకప్ వార్త చెప్పారు. విడిపోయినా వీరు స్మేహంగానే ఉంటున్నారు. సుస్మితకు సంబంధించిన పార్టీలు, ఫంక్షన్స్ లో రోహ్మన్ తరచూ కనిపిస్తూ ఉంటాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here