‘అమ్మ’లైన ముద్దుగుమ్మలు.. కెరీర్‌లో దూసుకెళ్తోన్న హీరోయిన్లు వీరే..!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కెరీర్ స్పాన్ చాలా తక్కువ. అందుకే చాలా మంది హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతలా తమ స్పాన్‌లో వీలైనన్ని సినిమాలు చేస్తుంటారు. చాలా మూవీస్‌లో పెళ్లి సీన్‌తో శుభం కార్డు పడినట్లు కొందరు కథానాయికల కెరీర్‌ కూడా పెళ్లికాగానే ఎండ్ అయిపోతుంది. ఇల్లు, కెరీర్ బ్యాలెన్స్ చేసుకోలేక, పిల్లలు పుట్టారని వాళ్ల బాగోగులు చూసుకోవాలనో, పెళ్లయిందనే కారణంతో అవకాశాలు రాక, పెళ్లి బంధంలో ఉండటం వల్ల గ్లామర్, ఇంటిమేట్ సీన్లు చేయనని చెప్పడం వల్ల ఇలా రకరకాల కారణాలతో కొందరి హీరోయిన్ల కెరీర్‌ పెళ్లి తర్వాత ఎండ్ అయిపోతుంది. ఇలా వివాహం అయ్యాక తెరపై కనుమరుగైన హీరోయిన్లు లెక్కలేనంత మందే ఉన్నారు.

కానీ కాలం మారింది. పరిస్థితులు మారాయి. జనాల మైండ్‌సెట్ మారింది. పెళ్లికి కెరీర్‌కు సంబంధం లేదని.. దేని దారి దానిదేననే క్లారిటీ చాలా మందిలో ఉంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి తర్వాత తెరపై రొమాన్స్ చేయడం కామన్ అయిపోయింది. ఒక లాయర్ ఎలాగైతే కోర్టులో వాదించి నల్లకోటు తీసేసి ఇంట్లోకి వెళ్తాడో తెరపై హీరోయిన్లు కూడా తమ సీన్స్ చేసేసి ఇంటికి వెళ్తారు అంతే కానీ అక్కడి రొమాన్స్‌లో రియలిజం ఉండదనే విషయాన్ని వారి పార్ట్‌నర్స్, ఇటు ఆడియెన్స్ అర్థం చేసుకుంటున్నారు.

ఇక పెళ్లై కొన్ని రోజులు నటించినా పిల్లలు పుట్టగానే కొంతమంది హీరోయిన్లు కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తుంటారు. పిల్లల ఆలనాపాలనా చూసుకోవాలని.. వారి తొలి అడుగు, తొలి మాట చూడాలనే కోరికతో వారిని వెంటపెట్టుకనే ఉండాలనుకుంటారు. ఈ క్రమంలో కొందరు సినిమాలు మానేస్తున్నారు. మరికొందరు మాత్రం అటు పిల్లలను మిస్ అవ్వకుండా ఇటు కెరీర్‌ను వదులుకోకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నారు. పిల్లలు తమ లైఫ్‌లో ఎంత ముఖ్యమో తమకు నచ్చిన పని చేయడం కూడా అంతే ముఖ్యమని భావిస్తున్నారు. అందుకే పెళ్లయినా.. పిల్లలు పుట్టినా.. మళ్లీ తెరపైకి వస్తున్నారు. తమకు నచ్చిన యాక్టింగ్ చేస్తూ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. అలా పెళ్లి తర్వాత, పిల్లలు పుట్టాక కెరీర్‌ను మునుపటి లాగే కొనసాగిస్తూ.. దూసుకెళ్తున్న కొందరు హీరోయిన్లు గురించి తెలుసుకుందామా..

- Advertisement -

 

కరీనా కపూర్.. ఈ బ్యూటీకి పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ఓవైపు సినిమాలు.. మరోవైపు వెబ్ సిరీస్‌లు.. ఇంకోవైపు యాడ్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. అలా అని ఫ్యామిలీకి టైం కేటాయించడం లేదనుకుంటే పొరపాటే. తరచూ డిన్నర్‌లు, వెకేషన్లకి వెళ్తుంటుంది ఈ భామ. పిల్లలతో వీకెండ్‌లో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. కేవలం ఫ్యామిలీ, పిల్లలే కాదు ఈ బ్యూటీ తన ఫ్రెండ్స్‌తోనూ వెకేషన్స్‌కి వెళ్తూ ఉంటుంది.

 

అనుష్క శర్మ.. ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లిని పెళ్లాడిన అనుష్క గతేడాది వామికకు జన్మనిచ్చింది. వామిక పుట్టిన కొన్ని నెలల వరకు తనతోపాటే ఉన్న అనుష్క ఆ తర్వాత మళ్లీ తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఫుల్ స్పీడ్‌లో ఇప్పుడు తన కెరీర్‌లో దూసుకెళ్తోంది. ఓ వైపు తన భర్త విరాట్‌కు సపోర్ట్ ఇస్తూ మరోవైపు తన కూతురు వామిక ఆలనా పాలనా చుసుకుంటూ ఇంకో వైపు తన కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది.

 

ఆలియా భట్.. బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లాడిన ఆలియా భట్ ఇటీవలే కుమార్తెకు జన్మనిచ్చింది. 8 నెలల గర్భవతిగా ఉన్నా ఈ బ్యూటీ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడిపింది. ప్రగ్నెంట్‌గా ఉన్నా.. సినిమా షూటింగ్‌లో పాల్గొంది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆలియా తన తర్వాత సినిమాలపై ఫోకస్ పెడుతోంది. వీళ్లే కాక సోహా అలీఖాన్, నేహా ధుపియా, శిల్పా శెట్టి ఇలా చాలా మంది హీరోయిన్లు పెళ్లై, పిల్లలు పుట్టిన తర్వాత కూడా తమ కెరీర్‌లో దూసుకెళ్తున్నారు.

 

ఇక టాలీవుడ్ సంగతికి వస్తే.. కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న కాజల్ ఇటీవలే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఒక 6 నెలలు గ్యాప్ తీసుకున్న కాజల్ ఇప్పుడిప్పుడే మళ్లీ కెమెరా ముందుకు వస్తోంది. భారతీయుడు 2 కోసం త్వరలోనే రంగంలోకి దిగనుంది.

 

మరోవైపు శ్రియా.. దశాబ్ధాలైనా శ్రియ అందం చెక్కు చెదరలేదు. రాధకు జన్మనిచ్చిన శ్రియ తన కూతురితో పాటు తాను కూడా చిన్న పిల్లలా మారిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. మరోవైపు సినిమాల్లోనూ రాణిస్తోంది. ఇటీవల దృశ్యం2 సినిమాతో బాలీవుడ్‌లో హిట్ కొట్టింది. ఇక కన్నడ భామ ప్రణీత కూడా లాక్‌డౌన్‌లో పెళ్లి చేసుకుని ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. చెక్కు చెదరని అందంతో కెరీర్‌పైనా ఫోకస్ చేస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here