మహేష్ బాబు ఆ విషయంలో అంబానీతో పోటీపడుతున్నాడని తెలుసా..

- Advertisement -

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు చాలామంది పాన్‌ ఇండియా స్టార్స్‌గా మారిపోతున్నారు. దీంతో వారి క్రేజ్ అమాంతంగా పెరిగిపోతోంది. పాన్ ఇండియా క్రేజ్ వచ్చాక వీరు తీసుకునే రెమ్యూనరేషన్ కూడా కొండెక్కి కూర్చుంటోంది.ఇక వీరి ఆస్తుల విషయానికొస్తే దేశవిదేశాల్లో ఈ టాలీవుడ్ టాప్ స్టార్స్‌కు ఆస్తులున్నాయి. టాలీవుడ్ స్టార్లు కేవలం బిగ్ స్క్రీన్ పై కనిపించి మాత్రమే సంపాదించడం లేదు. పలు వ్యాపారాలు చేస్తూ కూడా సంపాదిస్తున్నారు. ఎక్కువగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో వీరంతా కుప్పలు కుప్పలుగా డబ్బులు సంపాదిస్తున్నారు.

మహేష్ బాబు
మహేష్ బాబు

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక మాంచి ప్రాపర్టీ దుబాయ్‌లో కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ తనయుడుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కోట్లాదిమంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవల ‘సర్కారు వారి పాట’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆయన రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లోను హీరో అనిపించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత సింపుల్ గా కనిపిస్తాడో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సాదాసీదాగా ఉంటాడు మహేష్. కానీ ఎప్పుడైనా వెకేశన్స్ కు వెళితే మాత్రం మహేష్ చాలా కాస్ట్లీ బట్టలను ధరిస్తాడు. ఇక ఆ సమయంలో షూ నుండి క్యాప్ వరకు అన్నిటిపై దృష్టి పెడతారు మన నెటిజన్లు.

- Advertisement -
Mahesh Babu Namratha

తాజాగా ఎయిర్పోర్టులో లూయిస్ విక్టర్ బ్యాక్ తో దర్శనం ఇచ్చాడు మహేష్. ఇక ప్రస్తుతం ఆ బ్యాక్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాకు కనిపించాడు. ఇక ఆ సమయంలో మహేష్ బాబు తన భుజానికి కాస్ట్లీ లూయిస్ విట్టర్ క్రిస్టోఫర్ బ్యాక్ బ్యాగ్ తో దర్శనమిచ్చాడు.

దీంతో నెటిజన్ల కళ్ళు ఆ బ్యాగు పై పడ్డాయి. చూసిన వెంటనే మహేష్ ధరించిన బ్యాగ్ ధర గూగుల్ తల్లిని అడగడం మొదలుపెట్టారు. తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు ధరించిన ఈ బ్యాగ్ ధర ఏకంగా 3,92,650 ఆరు రూపాయలు మహేష్ బాబు ధరించిన ఈ బ్యాగ్ చాలా సొగసైన డిజైన్తో విశాలమైన కంపార్ట్మెంట్ లతో ఉంటుందట. ఇక ఈ విల్లాలు, ఈ బ్యాగ్ చూసి అంబానీతో పోటీ పడుతున్నావా మహేష్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here