Mahesh Babu: త్రివిక్రమ్ పై మహేష్ అసంతృప్తి..షూటింగ్ క్యాన్సిల్..సినిమా ఔట్పుట్ అంత దారుణంగా ఉందా!

- Advertisement -

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ 3 డైరెక్టర్స్ లో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.గత కొంతకాలం నుండి ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో రెగ్యులర్ గా జరుగుతుంది.మహేష్ తో గతం లో త్రివిక్రమ్ అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు తీసాడు. ఇవి కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు కానీ, టీవీ టెలికాస్ట్ లో మాత్రం బంపర్ హిట్ అయ్యింది.

Mahesh Babu
Mahesh Babu

ఇప్పటికి ఈ సినిమాలు వచ్చినప్పుడు టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోతుంటాయి.అందుకే ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమా పై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి.ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతుంది. షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఓవర్సీస్ రైట్స్ 4 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.

mahesh

అయితే ఈ సినిమా పై సోషల్ మీడియా లో కాసేపటి క్రితం నుండి ఒక రూమర్ వైరల్ గా మారింది.అదేమిటంటే మహేష్ బాబు ఈ సినిమా ఔట్పుట్ పట్ల సంతృప్తికరంగా లేదని, ఇప్పటి వరకు త్రివిక్రమ్ తీసిన కంటెంట్ మొత్తం డిలీట్ చేసి ఫ్రెష్ గా మళ్ళీ తియ్యాలని, అప్పటి వరకు షూటింగ్ కి బ్రేక్ అని మహేష్ మూవీ నిర్మాతకి చెప్పాడంటూ సోషల్ మీడియా లో ఒక వార్త ప్రచారం అయ్యింది.

- Advertisement -

ఇది చూసి మహేష్ ఫ్యాన్స్ భయపడ్డారు, అయితే సోషల్ మీడియా లో వచ్చిన ఈ వార్త పై ఆ చిత్ర నిర్మాత సూర్య దేవర నాగవంశీ స్పందించాడు.గాసిప్ వెబ్ సైట్స్ రాసే వార్తలను నమ్మొద్దు, ఈ చిత్రం మహేష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలవబోతుంది.కచ్చితంగా నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది, మే 31 వ తేదీన మీ మైండ్ బ్లాక్ అయ్యే అప్డేట్ ఇవ్వబోతున్నాం అంటూ ట్విట్టర్ లో నాగ వంశీ ఒక ట్వీట్ వేసాడు.ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా నిల్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here