Sudigali Sudheer కు ఎప్పుడో పైళ్ళైందా?

- Advertisement -

Sudigali Sudheer పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. అందరికి సూపరిచితమే.. ఇటు బుల్లితెరపై, అటు వెండి తెర పై వరుస అవకాశాలను అందుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ బాగా పాపులర్ అయ్యాడు.. ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఒక వార్త ఇండస్ట్రీలో షికారు చేస్తుంది..

Sudigali Sudheer
Sudigali Sudheer

గత పదేళ్లుగా జనాలను మోసం చేస్తూ వస్తున్నాడంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.. చాలా మందికి రష్మీ, సుధీర్ లు ప్రేమించుకుంటున్నారు, త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారని మాత్రమే తెలుసు. అసలు విషయం వేరే ఉంది ఇతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని, ఆ విషయాన్ని ఎందుకు దాచి పెట్టారనే చర్చలు గుప్పుమన్నాయి..

అసలు విషయం ఏంటంటే.. 2014 లోనే సుధీర్ వివాహం అయింది. ఆ పెళ్లి కి జబర్దస్త్ మాజీ టీం లీడర్ ధనరాజ్ తో పాటు ప్రస్తుత టీం లీడర్ రాకింగ్ రాకేష్ కూడా హాజరయ్యాడు. రాకింగ్ రాకేష్ అప్పట్లో తన ఫేస్‌ బుక్ లో తాను సుధీర్ పెళ్లి కి వెళ్లాను అంటూ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

- Advertisement -
Sudheer marriage

నిజంగానే సుధీర్ పెళ్లి అయిందా.. అయితే ఎప్పుడు చేసుకున్నాడు? ఇన్ని రోజులు దాచడానికి కారణం ఏంటి? అసలు ఇన్నాళ్లు ఎలా సుధీర్ వివాహం గురించి దాచారు అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ పెళ్లి అయితే ఆమె నుండి విడాకులు తీసుకున్నాడా? అని ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే సుధీర్ నోరు విప్పాల్సిందే.

Sudheer rashmi

ఇక సుధీర్ కెరీయర్ గురించి మాట్లాడుకుంటే.. సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. సినిమాల్లో హీరోగా నటిస్తున్న కారణంగా జబర్దస్త్‌ కార్యక్రమంకు దూరం అయ్యాడు.. యూట్యూబ్ లో మొన్నటివరకు ట్రెండ్ అయిన రష్మీ తో లవ్ ట్రాక్ అంతా పాపులర్ అవ్వడానికేనా.. అయ్యో రష్మీకి ఈ విషయం తెలుసా.. ఇలా ఎన్నో ప్రశ్నలు జనాలకు వస్తున్నాయి.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు.. కానీ ద్రావణంలా వ్యాపిస్తుంది.. అసలు నిజమేంటో తెలియాలంటే సుధీర్ నోరు విప్పాల్సిందే…

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here