Bichagadu 2 trailer review : స్నీక్​ పీక్​ ట్రైలర్.. బ్రెయిన్ ట్రాన్స్​ప్లాంటేషన్.. ఆకట్టుకుంటున్న స్టోరీ..

- Advertisement -

Bichagadu 2 trailer review : తమిళ హీరో విజయ్‌ ఆంటోని దర్శకత్వంలో తెరకెక్కితోన్న లేటెస్ట్‌ చిత్రం ‘బిచ్చగాడు 2’.. మొదటి సినిమా బిచ్చగాడు ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.. దానికి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకేక్కించారు.. మొదటి నుంచి ఈ సినిమాపై జనాల్లో ఆసక్తిని పెంచుతున్నారు చిత్రాయూనిట్..

Bichagadu 2 trailer review
Bichagadu 2 trailer review

కథ :

ఈ సినిమా పై మొదటి నుంచి కొత్తగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్..ఈ సినిమా లో హీరో, బెగ్గర్ గెటప్ లో కనిపిస్తాడని ఎవరూ ఊహించరు. దాన్ని చేసి చూపించాడు తమిళ హీరో విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించినప్పటికీ హిట్స్ ఏం కొట్టలేకపోయాడు. త్వరలో ‘బిచ్చగాడు 2’గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తాజాగా స్నీక్ పీక్ ట్రైలర్ పేరుతో దాదాపు 4 నిమిషాలపాటు ఉన్న ఓ వీడియోని రిలీజ్ చేశారు. అయితే ఇందులో హీరో విజయ్ ఆంటోని ఎక్కడా కనిపించకపోవడం విశేషం.

- Advertisement -

విశ్లేషణ :

మెయిన్ కాన్సెప్ట్ బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని ట్రైలర్ ను చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది.పెద్ద వాళ్ళ బ్రెయిన్స్ ని ఇలా ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి ఏళ్లకు ఏళ్లకు సమాజానికి ఉపయోగపడేలా చేయాలను కుంటున్నామని.. దానికి ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే బాగుంటుందని ఓ డాక్టర్ చెబుతుంటాడు. టీవీలో టెలికాస్ట్ అవుతున్న ఈ ఇంటర్వ్యూని విలన్ దేవ్ గిల్ చూస్తుంటాడు.

అంతకు ముందు అతడు ఎంత క్రూరమైన వాడు అనేది పాము ఉన్న బోనులో హీరో ఎలుక వేసినట్లు చూపించారు. దీన్నిబట్టి చూస్తుంటే.. విలన్ తన బ్రెయిన్ ని ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి హీరో విజయ్ ఆంటోని ఫిక్స్ చేస్తారేమో.. టు ఇన్ వన్ లాగా స్టోరీని క్రియేట్ చేసినట్లు తెలుస్తుంది. హీరో విలన్ గా మారి ఎలాంటి పనులు చేస్తారు.

ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటారు అనేది సినిమా కాన్సెప్ట్..‘మనీ వల్ల ప్రపంచానికి చాలా ప్రమాదం’ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఇలా ట్రైలర్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ‘బిచ్చగాడు 2’.. ఈ ఆధునాతనమైన టెక్నాలజీని డబ్బు కోసం ఎలా దుర్వినియోగం చేశాడు, దీని ఎదురయ్యే పరిణామాల చూట్టు బిచ్చగాడు 2 కథ ఉండోబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం మూవీ షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఇదిలా రీసెంట్‌గా మలేషియలో జరిగిన షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో విజయ్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్‌ ఆంటోని 90 శాతం కోలుకున్నాడు. దీంతో అతడు షూటింగ్‌ను ప్రారంభించాడు. ఇక ఈ చిత్ర సమ్మర్‌ కానుకగా విడుదల కానుంది.. డైరెక్టర్ ఈ కథను ఎలాంటి ట్విస్ట్ లను యాడ్ చేస్తాడో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here