Hunt Collection : సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీ కి వచ్చిన వారిలో ఒకరు సుధీర్ బాబు.. తొలి సినిమా ‘SMS’ తోనే మంచి టాలెంట్ ఉన్న కుర్రాడిగా పేరు తెచ్చుకున్నాడు.. ఆ తర్వాత ‘ప్రేమ కథా చిత్రం’ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ లో స్థిరపడ్డాడు.. కానీ ఆ తర్వాత ఇతగాడు చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.. ఇప్పుడైతే ఆయన మార్కెట్ పూర్తిగా జీరో స్థాయికి వచ్చేసినట్టు అర్థం అయిపోతుంది.
గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా కనీసం కోటి రూపాయిల షేర్ ని కూడా వసూలు చెయ్యలేకపోయింది.. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న కీర్తి శెట్టి ని హీరోయిన్ గా పెట్టుకున్నప్పటికీ కూడా జనాలు ఈ చిత్రం పై ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.. ఇక ఆ తర్వాత ఆయన హీరో గా నటించిన ‘ది హంట్’ అనే చిత్రం ఇటీవలే విడుదలైంది.
ఈ సినిమా మీద సుధీర్ బాబు చాలా ఆశలే పెట్టుకున్నాడు.. ప్రొమోషన్స్ కూడా బాగా చేసాడు..కానీ ఫలితం మాత్రం సూన్యం.. ఈ చిత్రానికి కనీసం 7 లక్షల రూపాయిల షేర్ కూడా రాలేదంటున్నారు ట్రేడ్ పండితులు.. ఎంత పెద్ద ఫ్లాప్ అయినా ఒక సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి స్టార్ కి బావ మరిది కాబట్టి కనీసం కోటి రూపాయిల షేర్ వసూళ్లు అయినా రాబట్టాలి.. కానీ అలా జరగలేదు.. దీనిని బట్టీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఈ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ ఏ మాత్రం కూడా ఆసక్తి చూపించలేదని.
వరుసగా సుధీర్ బాబు చివరి మూడు సినిమాలకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురు అయ్యింది..ఇలాగే కనుక కొనసాగే పనైతే ఆయన సినిమాలు చెయ్యడం మానేయడమే బెటర్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు..ప్రస్తుతం సుధీర్ బాబు ‘పుల్లెల గోపీచంద్’ బయోపిక్ లో నటిస్తున్నాడు.. పాన్ ఇండియా స్కేల్ లో ఈ చిత్రం తెరకెక్కబోతుంది..కనీసం ఈ సినిమాతోనైనా సుధీర్ బాబు భారీ హిట్ కొడుతాడో లేదో చూడాలి.