SSMB28: మరో లుక్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. ఆసక్తికరంగా మహేష్ ట్వీట్..

- Advertisement -

టాలివుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ఈ మధ్య వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.. ప్రస్తుతం త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా చేస్తున్నారు.. SSMB28 పేరుతో ఆ సినిమా తెరకేక్కుతుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు భారీ హిట్ ను అందుకున్నాయి.. దాంతో ఈ సినిమా పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు.. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ మారుతుంది..

SSMB28
SSMB28

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నేడు కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మహేష్ – త్రివిక్రమ్ టైటిల్ తో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేస్తారని ప్రకటించారు మేకర్స్..నేడు దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు కావడంతో ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా, టాలీవుడ్ లో మొట్టమొదటి కౌబాయ్ సినిమా అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. మోసగాళ్లకు మోసగాడు రీ రిలీజ్ థియేటర్స్ లో నేడు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు మహేష్ – త్రివిక్రమ్ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేయనున్నారు..

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ని తలుచుకుంటూ ఈ సినిమా నుంచి తలకు మాస్ గా రెడ్ టవల్ కట్టుకొని ఫైట్ కి సిద్ధమవుతున్నట్టు ఉన్న ఓ లుక్ ని మహేష్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. ఇవాళ చాలా స్పెషల్ రోజు. ఇది మీ కోసమే నాన్న అంటూ ట్వీట్ చేశారు. దీంతో మహేష్ చేసిన ట్వీట్, ఆ లుక్ వైరల్ గా మారాయి.. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 న రిలీజ్ చెయ్యనున్నారు..ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here