కోట్లు సంపాదిస్తున్న మహేష్ కూతురు సితార.. నాన్న కంటే ఎక్కువ సంపాదిస్తుందిగా

- Advertisement -

మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల ముద్దుల కుమార్తె సితార. చిన్నప్పటి నుంచే చాలా యాక్టివ్. సోషల్ మీడియాలో పాపులారిటీని సంపాదించుకుంది. అప్పుడప్పుడు కొన్ని డ్యాన్స్ వీడియోలు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. సినిమాల్లోకి రాకున్నా.. తనకంటూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది ఈ స్టార్ కిడ్. ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్‌ను ఆమోదించి అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్‌ పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ట్ కిడ్‌గా నిలిచింది.

సితార
సితార

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ PMJ జ్యువెలరీ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది మహేష్ కూతురు సితార.ఇక ఈ ఒప్పందంలో భాగంగా భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయాన్ని మహేష్ ఫ్యామిలీ ఈ మాత్రం బయటికి రానివ్వలేదు. ఈ విషయంలో అత్యంత గోప్యతని పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ మూడు రోజులపాటు ఓ రహస్య ప్రదేశంలో ఇందుకు సంబంధించి యాడ్ ఫిలిం కూడా చిత్రీకరించారు. ఇండియాలోనే స్టార్ టెక్నీషియన్స్ అంతా ఈ కమర్షియల్ షూట్లో పాల్గొన్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో టెలివిజన్, ఇతర ప్లాట్ ఫామ్స్ లో ఈ యాడ్ ప్లే కానుంది.

ఇక ఈ యాడ్ షూట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సితార డ్యాన్స్ వీడియోలకు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తాయి. సితార వయస్సు తక్కువే అయినా చాలా టాలెంటెడ్ అని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఇన్ స్టాగ్రామ్ లో సితారకు ఏకంగా 12 లక్షల కంటే ఎక్కువగా ఫాలోవర్లు ఉన్నారు. ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థ సితారను సంప్రదించిందని రెమ్యునరేషన్ భారీ స్థాయిలోనే ఉందని సమాచారం. 20 లక్షలకు అటూఇటుగా సితార రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here