శ్రీలీల చేస్తున్న పనికి తలలు బాదుకుంటున్న నిర్మాతలు..

- Advertisement -

శ్రీలీల తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల సంఖ్యను ఒకసారి చూస్తే.. శ్రీలీల తెలుగు చిత్ర పరిశ్రమను ఎలా శాసిస్తుందో తెలుస్తుంది. మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా (SSMB28), పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’, NBK108, ఇందులో ఆమె బాలకృష్ణ కుమార్తెగా నటిస్తోంది. రామ్ పోతినేని – బోయపాటి సినిమా, వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ నటిస్తున్న కొత్త చిత్రం, నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రాజు, విజయ్ దేవరకొండ 12వ సినిమా.

శ్రీలీల
శ్రీలీల

అయితే ఇందులో విజయ్ దేవరకొండ సినిమా మినహా, మిగిలిన సినిమాలన్నీ షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. దీంతో ఆమె డేట్స్ కుదరక నిర్మాతలు కష్టపడుతున్నారు. ఒకరోజు డేట్ మిస్ అయ్యిందంటే.. ఇక ఆమె డేట్ దొరకడం చాలా కష్టంగా మారిందట. దీంతో నిర్మాతలకు కొత్త తలనొప్పులు వచ్చాయని అంటున్నారు. పొరపాటున ఒకసారి ఇచ్చిన డేట్స్ మిస్ అయితే ఆమె డేట్స్ పట్టుకునేందుకు చాలా సమయం పడుతుందట. ఆమె చేస్తున్న సినిమాలన్నీ దాదాపు స్టార్ హీరోలతోనే చేస్తున్న నేపథ్యంలో హీరోతో కాంబినేషన్ సీన్స్ షూట్ చేయడానికి దర్శక నిర్మాతలు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలా వరుస అవకాశాలు శ్రీ లీల దక్కించుకుంటూ ఉండటంతో రష్మిక మందన, పూజా హెగ్డే వంటి వారు పూర్తిగా బాలీవుడ్కే పరిమితమై అక్కడ ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో పడ్డారు.

కేవలం రెండే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ లీల ఇలా ఏడు సినిమాలతో బిజీబిజీగా గడుపుతూ దర్శక నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుంది అని అంటున్నారు. కావాలని ఆమె క్రేజ్ ప్రకారమే ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసుకున్నా ఇప్పుడు డేట్స్ సర్దుబాటు చేయలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.ఇప్పటికే ధమాకా హిట్‌తో ఫుల్ ఫామ్‌లో ఉన్న శ్రీలీల మహేష్ , త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గోంటోంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాతో పాటు ఇక లేటెస్ట్‌గా పవన్ – సాయి ధరమ్ తేజ్ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించనుందని తెలుస్తోంది.

- Advertisement -

అది అలా ఉంటే శ్రీలీలకు మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. శ్రీలీల ఇప్పటికే ఓ తొమ్మిది సినిమాల్లో నటిస్తున్నారు. ఇక లేటెస్ట్‌గా ఈ భామ విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్’లో వస్తున్న సినిమాలో హరోయిన్‌గా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో ఓ ప్రకటనరానుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. వీటికి తోడు ఈ భామ పవన్ లేటెస్ట్ వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ సినిమాలో ఐటెమ్ సాంగ్‌లో కనిపించనుందని అంటున్నారు. దీనికి పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయడానికి ఈ భామ 60 లక్షలు డిమాండ్ చేస్తోందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here