Sunny Leone : షార్ట్ స్కర్ట్‌లో సన్నీ లియోనీ హాట్ పోజులు



బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సన్నీ లియోనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన హాట్ అందాలతో ఎప్పటికప్పుడు ఫొటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తూ ఉంటుంది. హిందీతో పాటు టాలీవుడ్‌ సినిమాల్లోనూ ఈ భామ నటిస్తోంది. ఇక Sunny Leone Instragram ఖాతాలో పోస్ట్ చేసే ఫొటోలకు యువత మామూలుగా ఫిదా అవ్వరు.

Sunny Leone
Sunny Leone

సన్నీ లియోనీ అసలు పేరు కరన్‌జీత్ కౌర్ వోహ్రా. ఈ బ్యూటీ కెనడాలో జన్మించింది. సన్నీ తల్లిదండ్రులు భారతీయ సిక్కులు. 1981 మే 13న ఈ బ్యూటీ భూమిపైకి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులో మొదట మోడలింగ్ చేస్తూ ఆ తర్వాత శృంగార సినిమాల్లో నటించింది.

తర్వాత ఈ భామ తన మకాం ముంబయికి మార్చింది. జిస్మ్ 2తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూ మరోవైపు ఐటెం సాంగ్స్‌లో నటిస్తోంది. సన్నీ డ్యాన్స్‌కి పెద్ద పెద్ద స్టార్సే ఫిదా అయ్యారు. ఓ వైపు మూవీస్ చేస్తూనే మరోవైపు పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్-5 సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్లింది. అక్కడ తన ప్రవర్తనతో హిందీయే కాకుండా దేశవ్యాప్తంగా ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది.

సన్నీ బాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. మంచు మనోజ్ కరెంట్ తీగ, రాజశేఖర్ పీఎస్‌వీ గరుడ వేగ, రీసెంట్‌గా మంచు విష్ణు జిన్నా మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. టాలీవుడ్‌లో ఈ హాట్ బ్యూటీ నటించిన డ్యాన్స్ నంబర్ డియ్యో డియ్యో డిసక డిసక సాంగ్ చాలా ఫేమస్ అయింది.

సన్నీ లియోనీ ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. తరచూ తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్‌కి వెళ్తూ ఉంటుంది. ఇక బర్త్ డే, మ్యారేజ్ ఆనివర్సరీ వంటి అకేషన్లలో సన్నీ తన ఫ్యామిలీతో చేసే సందడి అంతా ఇంతా కాదు.