Mehreen kaur : ‘F2’ బ్యూటీ మెహ్రీన్‌కు ఏమైంది.. ముఖం నిండా సూదులతో..

- Advertisement -

‘హనీ ఈజ్‌ ది బెస్ట్..’ అంటూ టాలీవుడ్‌లో తనకంటూ క్రేజ్ సంపాదించుకుంది మెహ్రీన్ పీర్జాద ( Mehreen kaur ). కృష్ణగాడి వీర ప్రేమగాథ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ‘నేను చెప్పానా.. నేను చెప్పానా.. నేను చెప్పానా’ అంటూ కుర్రాళ్లకు తనేంటో చెప్పేసింది. ఆ మూవీలో మెహ్రీన్ నటన చూసి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

Mehreen kaur
Mehreen kaur

ఇక మెహ్రీన్‌కు అప్పటి నుంచి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుని అరడజనుకు పైగా ఈ బ్యూటీ సినిమాలు చేసింది. అయినా అనుకున్న స్థాయిలో గుర్తింపు పొందలేకపోయింది. అనిల్ రావిపూడి క్రియేట్ చేసిన కామెడీ యూనివర్స్ ఎఫ్2తో మళ్లీ ఈ భామ ఫామ్‌లోకి వచ్చింది. ఆ తర్వాత అదే మూవీ సీక్వెల్ ఎఫ్‌3లోనూ సందడి చేసింది.

Actress Mehreen kaur

ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. తరచూ తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు లైవ్‌లోకి వస్తూ ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తుంది. ఇక వెకేషన్లకు వెళ్లినప్పుడల్లా అక్కడి ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వాటి గురించి ఫ్యాన్స్‌కు ముచ్చట్లు చెబుతుంది. తాజాగా మెహ్రీన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

ముఖం నిండా సూదులతో ఉన్న ఫొటోని మెహ్రీన్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఏమైందంటూ అభిమానుల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆక్యుపంక్చర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే దీనిపై నెటిజన్లు మిశ్రమ స్పందన తెలియజేస్తున్నారు. ‘మీరు సహజంగానే అందంగా ఉంటారు’ అని ఒకరంటే.. ‘ఇలాంటి వాటితో జాగ్రత్త’ అని మరొకరు కామెంట్‌ చేశారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here