Sitara : తండ్రికి తగ్గ తనయ.. పాకెట్ మనీ డొనేట్ చేసిన మహేష్ బాబు కూతురు సితార

- Advertisement -

Sitara : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ హీరో అందం ఫైన్ వైన్‌లా మరింత పెరిగిపోతోంది. నాలుగు పదుల వయసులోనూ కుర్రాడిలా మహేశ్ తన అందంతో అమ్మాయిల మనసు కొల్లగొడుతున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయినా.. ఇంకా అమ్మాయిల కలల రాజకుమారుడే అనిపించుకుంటున్నాడు. వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు ఈ సూపర్ హీరో.

Sitara
Sitara

సినిమాలు.. యాడ్స్ షూటింగ్స్.. ఇతర వ్యాపారాలు.. ఇలా ఎన్ని పనులున్నా.. ఎంత బిజీగా ఉన్నా.. మహేశ్ బాబు తన కుటుంబానికి మాత్రం తప్పకుండా టైం కేటాయిస్తాడు. ఫ్యామిలీతో కలిసి తరచూ వెకేషన్స్‌కు వెళ్తుంటాడు. తన పిల్లలు గౌతమ్‌, సితారలతో కలిసి తాను చిన్నపిల్లాడై ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. మనసుకు నచ్చిన పని చేయడం.. ఎప్పుడూ హ్యాపీగా ఉండటమే తన అందానికి కారణం అంటూ ఉంటాడు ఈ రాజకుమారుడు.

Mahesh babu and Sitara
Mahesh babu and Sitara

సినిమాల్లో బిజీగా ఉంటూనే.. సమాజ సేవలో ముందుంటున్నాడు టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు. ఇప్పటి వరకు ఎంతో మంది చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించాడు. ఈ కొత్త సంవత్సరం మరో అడుగు ముందుకేసి మహేశ్​ బాబు ఫౌండేషన్​ వెబ్​సైట్​ ప్రారంభించాడు. దీనికి సంబంధించి తన కుమార్తె సితారతో ఓ వీడియో విడుదల చేశాడు.

- Advertisement -

మహేశ్ బాబు ఓ సినిమా తారగానే కాకుండా.. మంచి మనసున్న వ్యక్తిగా కూడా పేరు సంపాదించుకున్నారు. ఎంతో మంది చిన్నారులకు అండగా ఉన్నారు. ఎంతో పిల్లలకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడారు. ఇలా సేవలు చేయడానికి ఓ ఫౌండేషన్​ కూడా స్థాపించారు. కొత్త సంవత్సరంలో అలాంటి సేవలను మరింత విస్తృతం చేసేందుకు ఆ ఫౌండేషన్​కు సంబంధించిన వెబ్​సైట్​ను లాంచ్​ చేశారు. అయితే ఈ వెబ్​సైట్​ లాంచ్​లో భాగంగా తన కుమార్తె సితారతో ఓ స్పెషల్​ వీడియో చేసి.. సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది మహేశ్ బాబు ఫౌండేషన్​.

‘పిల్లలు సంతోషంగా ఉండేందుకు ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్​ చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. అందులో భాగంగానే మేము మా అధికారికి వెబ్​సైట్​ను ప్రారంభిస్తున్నాము’ అని రాసుకొచ్చింది. దానికి ‘ ఫర్​ ది చిల్డ్రెన్​​.. టు ది చిల్డ్రెన్ ‘ అని క్యాప్షన్​ జోడించింది. కాగా, ఫౌండేషన్​కు తన పాకెట్ మనీ ఇస్తున్నట్లు తెలిపింది మహేశ్ ముద్దుల కూమార్తె సితార.

“మా ఫ్యామిలీ ఫౌండేషన్​ వెబ్​సైట్​ను ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మా నాన్న స్టార్డ్​ చేసిన ఈ ఫౌండేషన్​లో నేను పాలు పంచుకోవాలనుకునేదాన్ని. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. అందుకు ఈ నెల నా పాకెట్​ మనీని మహేశ్​బాబు ఫౌండేషన్​కు డొనేట్​ చేస్తున్నా. మీరు కూడా మీ వంతు విరాళం ఇవ్వండి. మనందరం కలిసి.. పిల్లలు సంతోషంగా ఉండేందుకు ఈ ప్రపంచాన్ని ఓ మంచి ప్రాంతంగా మారుద్దాం” అని సితార పిలుపునిచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here