Siddharth, Aditi Rao Hydari : శర్వానంద్ ఎంగేజ్​మెంట్​లో లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ – అదితి



Siddharth, Aditi Rao Hydari : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రక్షితా రెడ్డితో శర్వా త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ జంట నిశ్చితార్థ వేడుక గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఘనంగా జరిగింది. చిరంజీవి, నాగార్జున, రామ్‌చరణ్‌ సతీసమేతంగా హాజరై కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నాని, రానా, అల్లరి నరేష్‌, నితిన్‌, శ్రీకాంత్‌, తరుణ్‌ తదితరులు సైతం ఈ వేడుకకు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. శర్వాకు కాబోయే భార్య రక్షిత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆమె తండ్రి మధుసూదన్‌ రెడ్డి హైకోర్టు న్యాయవాది. తల్లి సుధారెడ్డి. పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

Siddharth, Aditi Rao Hydari
Siddharth, Aditi Rao Hydari

శర్వా ఎంగేజ్మెంట్ వేడుకలో అందరి దృష్టిని ఓ జంట బాగా ఆకర్షించింది. వాళ్లెవరో కాదు సిద్ధార్థ్-అదితీరావు హైదరీ. కొంతకాలంగా ఈ జంట ప్రేమలో ఉన్నట్లు తెగ వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు ఊతమిస్తూ తరచూ ఈ ఇద్దరు ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టడం.. సోషల్ మీడియాలో బహిరంగంగానే ఒకరిపై మరొకరి ప్రేమను చాటుకోవడంతో వాళ్ల రిలేషన్​షిప్​ను నెటిజన్లు కన్ఫమ్ చేశారు. కోలీవుడ్ టూ బాలీవుడ్ వయా టాలీవుడ్ ఈ పుకార్లు ప్రయాణించినా.. ఈ జంట ఇప్పటి వరకు వాటిని ధ్రువీకరించలేదు.. అలాగని కొట్టివేయనూ లేదు. ఈ లవ్​బర్డ్స్ ప్రవర్తన ఒక రకంగా నెటిజన్లను డైలమాలో పడేసింది.

ఈ జంట త్వరలోనే పెళ్లికి కూడా రెడీ అవుతుందంటూ బీ టౌన్​లో కథనాలు కూడా వచ్చాయి. కానీ ఈ ఇద్దరు ఇప్పటి వరకు తమ రిలేషన్​షిప్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏమో.. చాలా మంది సెలబ్రిటీల్లాగే వీళ్లు కూడా సీక్రెట్​గా పెళ్లి చేసుకుంటారో లేక.. పెళ్లి చేసుకుని ఫ్యాన్స్​కు షాకింగ్ సర్​ప్రైజ్​ ఇస్తారో తెలియదు. అయితే ఈ జంట ప్రేమాయణం గురించి రకరకాల పుకార్లు వస్తున్న తరుణంలో.. ఈ లవ్​ బర్డ్స్ తమ రిలేషన్​షిప్ నిజమే అని చెప్పేలా ఓ పని చేశారు.

Siddharth and aditi

అదేంటంటే.. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్-రక్షితల ఎంగేజ్మెంట్ వేడుకకు కలిసి హాజరయ్యారు. ఈ వేడుకలో సిద్ధార్థ్- అదితీలే హైలైట్. అందరి కళ్లూ ఈ జంటపైనే ఉన్నాయని టాక్. ఆ వేడుకలో లైమ్ లైట్ అంతా ఈ జంటే లాగేసిందని సమాచారం. శర్వా నిశ్చితార్థ వేడుక ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ తెగ సంబురపడిపోయారు. అంతకంటే ఎక్కువ సిద్ధార్థ్ – అదితి ఈ వేడుకకు కలిసి రావడంతో ఖుష్ అయ్యారు. ఈ వేడుకలో లవ్​బర్డ్స్ ఎంత క్యూట్​గా ఉన్నారో అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. క్యూట్ పెయిర్ అంటూ ట్యాగ్స్ చేస్తున్నారు.

సిద్ధార్థ్ – అదితి `మహాసముద్రం`లో శర్వాతో కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్​లోనే ఈ సిద్ధార్థ్ – అదితి ప్రేమలో పడినట్లు టాక్. గతంలో సిద్ధార్థ్ అదితితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. ఆ ఫొటో కింద క్యాప్షన్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అప్పుడే వీళ్లిద్దరు లవ్​లో ఉన్నట్లు కన్ఫమ్ చేసుకున్నారు ఫ్యాన్స్. ఇంతకీ ఆ క్యాప్షన్ ఏంటంటే..`హృదయంలో యువరాణి` అని ప్రేమగా క్యాప్షన్ యాడ్ చేశాడు సిద్ధార్థ్. కొన్నాళ్లుగా సహజీవనంలో ఉన్నారన్న కథనాల నడుమ ఇప్పుడిలా శర్వా నిశ్చితార్థానికి కలిసి రావడంతో  ఈ జంట తమ సంబంధాన్ని అధికారికం చేసినట్టేనని టాక్ వినిపిస్తోంది.