Pawan Kalyan : 30 వ తారీఖున ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ చిత్రం #OG

- Advertisement -

Pawan Kalyan : రాజకీయాల్లో బిజీ గా ఉంటూ సినిమాలు చెయ్యడం అనేది సాధారణమైన విషయం కాదు..ఒక రాజకీయ పార్టీ ని సమర్థవతంగా నడుపుతూ, వరుసగా క్రేజీ సినిమాలతో అభిమానులను ఉర్రూతలూ ఊగించేలా చెయ్యడం ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం..రీ ఎంట్రీ తర్వాత వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ వంటి సూపర్ హిట్ సినిమాలతో అభిమానుల్లో జోష్ నింపిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ తో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమా లో నటిస్తున్నాడు.

Pawan Kalyan
Pawan Kalyan

ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది..ఒక పక్క ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే సినిమాని ప్రారంభించాడు పవన్ కళ్యాణ్..ఇప్పుడు త్వరలోనే ఆయన చెయ్యబోతున్న #OG అనే చిత్రం షూటింగ్ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ నెల 30 వ తారీఖున ప్రారంభించబోతున్నాడు..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది.

Pawan Kalyan

‘రన్ రాజా రన్’ మరియు ‘సాహూ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన సుజిత్ ఈ #OG చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.. #RRR వంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్ ని తీసిన డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ టెక్నిషియన్స్ తో పాన్ ఇండియా లెవెల్ లో నిర్మించబోతున్నాడు..’గ్యాంగ్ స్టర్’ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అభిమానులు ఒక రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు..ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం యాక్షన్ జానర్ మూవీస్ కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు.

- Advertisement -

టాక్ తో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలు ఇండియాని రూల్ చేస్తున్నాయి.. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఇలాంటి సినిమాలు చేస్తే #RRR రికార్డ్స్ కూడా రిస్క్ లో పడినట్టే.. అందులోనూ డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని..ఒక వీరాభిమాని తన అభిమాన హీరో తో సినిమా తీస్తే ఎలాంటి సంచలనం రేపుతుందో గబ్బర్ సింగ్ తో ఇదివరకే మనం చూసాము..ఇప్పుడు #OG తో మరోసారి చూడబోతున్నాము.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here