Shivaji : వాడు నా వెంట్రుకతో సమానమన్న శివాజీ.. రోజురోజుకూ బూతుల పురాణంగా మారుతున్న బిగ్ బాస్

- Advertisement -

Shivaji : పవర్ అస్త్రా సాధించుకున్న వారు మాత్రమే కంటెస్టెంట్స్‌గా ఫిక్స్ అవుతారు అని బిగ్ బాస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవర్ అస్త్రా కోసం పోటీ ఎక్కవయ్యింది. ఇప్పటికే పవర్ అస్త్రా సాధించుకున్న వారిపై ఫోకస్ కూడా ఎక్కువయ్యింది. అయితే, అమర్ దీప్ చేసిన పనికి టేస్టీ తేజ.. అనుకోకుండా శివాజీకి టార్గెట్ అయ్యాడు. మొదటి వారంలో పవర్ అస్త్రాను సందీప్ గెలుచుకున్న తర్వాత కూడా దానిని శుభశ్రీ దొంగిలించింది. ఇప్పుడు శివాజీ పవర్ అస్త్రా విషయంలో కూడా అదే జరిగింది.

Shivaji
Shivaji

దీంతో సందీప్‌కు ఈ విషయం గురించి ఏమైనా ఐడియా ఉంటుందేమో అని తనతో డిస్కషన్ మొదలుపెట్టాడు. సందీప్‌కు శివాజీ పవర్ అస్త్రాను ఎవరు దొంగిలించారో తెలుసు అని చెప్పాడు. చెప్పొద్దు అని మాట తీసుకున్నాడని కూడా అన్నాడు. కానీ తాను ఎవరితో ఈ మాట గురించి చెప్పను అంటూ శివాజీ అడిగాడు. దీంతో సందీప్.. తేజ పేరు చెప్పాడు. అప్పటినుంచి తేజను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టాడు శివాజీ. ఈ విషయంలో తేజను ఇరికించినట్టుగా తనకు వెళ్లి చెప్పాడు సందీప్. కానీ అమర్‌దీపే ఆ అస్త్రాన్ని దొంగిలించిన విషయం తేజకు కూడా తెలియదు. తేజనే తన పవర్ అస్త్రాను దొంగిలించాడు అనుకున్న శివాజీ..

‘‘వాడికి క్యారెక్టర్ లేదు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా అది తన వెంట్రుకతో సమానం అంటూ కామెంట్ చేశాడు. క్యారెక్టర్ అనేది ముఖ్యమని, అడుక్కుతిని ఈ వీక్‌లో సేవ్ అయ్యాడని, ఇలాంటి చిల్లర గేమ్స్ ఆడకూడదు, మగాడిలాగా ఆడాలి అంటూ తేజను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌తో ఈ విషయం గురించి మాట్లాడిన శివాజీ.. తేజ బుద్ధి కుక్కతోకలాంటిది అని, అందుకే తను ఎదగడం లేదు అని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. తేజకు కూడా శివాజీ తననే టార్గెట్ చేస్తున్నట్టు తెలిసినా.. పెద్దగా స్పందించకుండా అలాగే ఉండిపోయాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here