Sai Pallavi : సినిమా మొదలు కాకముందే రొమాన్స్ చేసుకుంటున్న నాగచైతన్య, సాయిపల్లవి.. మిస్ అవుతున్నారుట పాపం..

- Advertisement -

Sai Pallavi : కొందరు నటీనటులు కథ నచ్చినా కూడా అందులో తమ పాత్రకు ప్రాధాన్యత లేకపోతే క్షణం కూడా ఆలోచించకుండా రిజెక్ట్ చేస్తారు. అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. ఇప్పటికే సాయి పల్లవి కెరీర్ ప్రారంభమయ్యి పలు సంవత్సరాలు అయినా తను నటించిన సినిమాల సంఖ్య మాత్రం తక్కువే. ఎందుకంటే కథ ఎలా ఉంది, అందులో తన పాత్ర ఎలా ఉంది అనే ఆలోచనలు సాయి పల్లవికి ఎక్కువ.

Sai Pallavi
Sai Pallavi

అలాంటి ఈ భామ.. ఒక యంగ్ హీరోతో రెండోసారి జతకట్టడానికి సిద్ధమవుతోంది. ఒక నటితో కెమిస్ట్రీ వర్కవుట్ అయితే.. అదే నటితో మళ్లీ మళ్లీ నటించడానికి హీరోలు ఏ మాత్రం వెనకాడరు. అలాంటి నటీమణుల్లో సాయి పల్లవి కూడా ఉంటుంది. ఏ హీరోతో నటించినా కూడా ఆ హీరోతో తన కెమిస్ట్రీని అద్భుతంగా పండించగల స్టామినా సాయి పల్లవిలో ఉంటుంది. అందుకే నేచురల్ స్టార్ నాని కూడా తనతో రెండు సినిమాలు చేశాడు.

ఇప్పుడు మరో యంగ్ హీరో నాగచైతన్య కూడా సాయి పల్లవితో జోడీకట్టడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో ‘లవ్ స్టోరీ’ చిత్రం వచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అలాంటి హిట్ తర్వాత మరోసారి వీరిద్దరు జతకట్టబోతున్నారు అనే వార్త ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. అలాగే సినిమా ఓకే అ్వడంతో వీళ్లిద్దరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఒకరినొకరు అభినందించుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here