మంచు విష్ణుకు హ్యాండ్ ఇచ్చిన నుపుర్ సనన్.. మాములుగా బయపడలేదుగా..చాలా ఏళ్ళ నుంచి విష్ణు మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అయినా ఒక్క హిట్ కూడా దరిచేరలేదు. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ అందుకోవాలని పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. భక్త కన్నప్ప పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. మహేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రభాస్ ఒక అతిథిగా నటిస్తున్నాడు.

ప్రభాస్ క్యామియో చేస్తున్నాడు అని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలయ్యింది. ఇక ఈలోపే ఒక బ్యాడ్ న్యూస్ ను అభిమానులకు చెప్పాడు విష్ణు. నుపూర్ సనన్ కొన్ని కారణాల వలన ఈ సినిమా నుంచి తప్పుకుందని అధికారికంగా చెప్పుకొచ్చాడు. ‘‘ఈ బాధాకరమైన విషయాన్నీ మీకు చెప్పడం నాకు చాలా బాధగా అనిపిస్తుంది.

షెడ్యూల్ విభేదాల కారణంగా కన్నప్ప నుండి నుపూర్ సనన్ వైదొలగవలసి వచ్చింది. మేము ఆమెను ఎంతో మిస్ అవుతున్నాం. ప్రస్తుతం .. ఇంకో కొత్త హీరోయిన్ కోసం మా వేట ప్రారంభమయ్యింది. వేరే కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న నుపూర్ కు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.. భవిష్యత్తులో ఆమెతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.