Shaakuntalam Review : ఆ ఒక్క మార్పు చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉండేది!

- Advertisement -

Shaakuntalam Review : వరుసగా విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు ని ఏర్పాటు చేసుకున్న సమంత ఇప్పుడు ‘శాకుంతలం’ అనే సినిమా ద్వారా మన ముందుకు వచ్చింది.గుణ శేఖర్ దర్శకత్వం వహిస్తూ, నిర్మాణం లో కూడా పాలు పంచుకొని తెరకెక్కించిన సినిమా ఇది.తన డ్రీం ప్రాజెక్ట్ గా చెప్పుకుంటూ వచ్చిన ఆయన కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం అనే గ్రంధాన్ని ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.దిల్ రాజు కూడా ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవహరించాడు.అయితే టీజర్ మరియు ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ గొప్పగా అయితే జరగలేదు.ఇక ఈరోజు అన్నీ బాషలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందో లేదో ఒకసారి ఈ రివ్యూ లో చూద్దాము.

shaakuntalam movie Review
shaakuntalam movie Review

కథ :

విశ్వామిత్ర మహర్షి తప్పస్సుని భగ్నం చేసేందుకు దేవేంద్రుడు మేనకా (మధుబాల) ని భూలోకంలోకి పంపిస్తాడు.విశ్వామిత్రుని తప్పస్సు భగ్నం చెయ్యడమే కాకుండా అతనితో ఒక బిడ్డకి జన్మని ఇస్తుంది మేనకా.ఆ బిడ్డే శకుంతల (సమంత).మానవుడి వల్ల కలిగిన సంతానం తో స్వర్గ లోకంలో అడుగుపెట్టడం నిషిద్ధం.అందుకే శకుంతల ని భూమి మీదనే వదిలి వెళ్ళిపోతుంది మేనకా.ఆకలితో అలమిటిస్తూ ఏడుస్తూ ఉన్న ఆ పాపని చూసి కణ్వ మహర్షి దత్తత తీసుకొని పెంచుకుంటాడు.అలా పెరిగి పెద్దయిన శకుంతల ఎంతో సౌందర్యం యువతిగా మారిపోతుంది.

ఒక రోజు దుశ్యంత మహారాజు కణ్వ మహర్షి ఆశ్రమానికి విచ్చేస్తాడు, అక్కడ శకుంతలని చూసి ఆమె అందం మరియు లావణ్యం చూసి ముగ్దుడు అయిపోతాడు.శకుంతల కూడా అతని ప్రేమలో పడిపోతుంది.ఆ తర్వాత కొద్దీ రోజులకు హస్తినాపురంకి తిరుగు ప్రయాణం అవుతాడు, మళ్ళీ తిరిగి వచ్చి రాజమర్యాదలతో హస్తినాపురం కి తీసుకెళ్తానని దుశ్యంత మహారాజు శకుంతల కి మాట ఇస్తాడు.రోజులు గడుస్తూ ఉంటుంది కానీ దుశ్యంత మహారాజు ఆమె వద్దకి రాడు.ఈ వ్యవధి లో శకుంతల గర్భం కూడా దాలుస్తుంది, ఆమె తిరిగి దుష్యంత మహారాజు వద్దకి వెళ్తుంది.కానీ దుష్యంత మహారాజు శకుంతల ని మర్చిపోతాడు.ఆయన అలా మర్చిపోవడానికి కారణం ఏమిటి..?, చివరికి ఏమైంది అనేది వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

- Advertisement -
samantha

విశ్లేషణ :

మహాభారతం ఇతిహాసాన్ని ఎన్ని సార్లు విన్నా,ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది.అభిజ్ఞాన శాకుంతలం గ్రంధం ఎంతో ప్రసిద్ధి చెందింది.శకుంతల మరియు దుష్యంత మహారాజు మధ్య గొప్ప ప్రేమని ఎంతో అందం గా వర్ణిస్తాడు మహాకవి కాళిదాసు.ఆయన రాసిన ఆ గ్రంధాన్ని ఆధారంగా తీసుకొనే డైరెక్టర్ గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.టేకింగ్ బాగుంది కానీ, స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉండడం, గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా అనిపించడం ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్స్ గా నిలిచింది.దిల్ రాజు లాంటి నిర్మాత ఉన్నప్పటికీ క్వాలిటీ విషయం లో ఎందుకు రాజీ పడ్డారు అనే సందేహం ఈ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులకు రాక తప్పదు.అయితే ఈ చిత్రాన్ని 3D లో చూస్తే కాస్త మంచి అనుభూతి కలుగుతుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే సమంత ఎప్పటిలాగానే తన పాత్రలో జీవించేసింది.శకుంతల గా ఆమె ఎన్నో ఎమోషన్స్ ని వెండితెర మీద పలికించింది.ఇక దుష్యంత మహారాజు గా నటించిన దేవ్ మోహన్ కూడా పర్వాలేదు అనిపించాడు, అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇందులో భరతునిగా నటించిన సంగతి తెలిసిందే.ఈమెలో ఇంత టాలెంట్ ఉందా ని ఆశ్చర్యపోక తప్పదు.భారీ డైలాగ్స్ సైతం చాలా తేలికగా చెప్పేసింది ఆమె.ఈ సినిమా చూసిన తర్వాత చైల్డ్ అర్సటిస్టుగా అల్లు అర్హ కి మంచి భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు.నటీనటుల తమ పాత్రలకు తగ్గ న్యాయం చేసారు కానీ, డైరెక్టర్ గుణ శేఖర్ మాత్రం టేకింగ్ విషయం లో వెనుకబడ్డాడు.కాస్త క్వాలిటీ ని కూడా మైంటైన్ చేసి ఉంటే ఈ చిత్రం మరో లెవెల్ కి వీల్లేదని చూసే ప్రేక్షకులకు అనిపించినా ఫీలింగ్.

samantha-shaakuntalam

చివరి మాట :

మహాభారతం ని ఇష్టపడే ప్రతీ ఒక్కరు ఈ సినిమాని ఒకసారి అయితే చూడొచ్చు, కానీ భారీ లెవెల్ గ్రాఫిక్స్ మరియు క్వాలిటీ ని ఆశించి చూస్తే మాత్రం నిరాశ చెందుతారు.

నటీనటులు :
సమంత , దేవ్ మోహన్ , మోహన్ బాబు , అల్లు అర్హ, అనన్య నాగేళ్ల, ప్రకాష్ రాజ్, సచిన్ ఖేద్కర్,శివ బాలాజీ, వర్షిణి, గౌతమి తదితరులు

డైరెక్టర్ : గుణ శేఖర్
సంగీతం : మణిశర్మ
నిర్మాతలు : దిల్ రాజు, గుణ శేఖర్

రేటింగ్ : 2.5 /5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here