Mahesh babu : హనుమంతుడిగా మహేష్ బాబు.. రాజమౌళి సినిమాపై క్లారిటీ..



Mahesh babu : దర్శకధీరుడు రాజమౌళి ఎంత మెల్లిగా సినిమాలను తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ కోసమే మినిమమ్ ఏడాది కేటాయిస్తాడు. ఎంతో డీటైలింగ్‌గా సినిమాకు సంబంధించిన పనులను చేపడతాడు. కథా చర్చల్లోనూ రాజమౌళి ఎంతో నిశితంగా లీనం అవుతాడు. అలాంటి దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు (Mahesh Babu) ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరలవుతోంది.

Mahesh babu
Mahesh babu

రాజమౌళికి పురాణాలు అంటే ఆసక్తి అని తన కథలను కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకొని రాస్తారని గతంలో చెప్పారు. ఇక యాక్షన్‌ అడ్వంచర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో మహేశ్‌ పాత్ర హనుమంతుడిని ప్రేరణగా తీసుకొని రాశారట. ఈ క్యారెక్టర్‌కు హనుమంతుడితో సమానమైన లక్షణాలు కూడా ఉంటాయని టాక్‌ వినిపిస్తోంది. ఆఫ్రికన్‌ అడవుల నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో భారీగా పోరాట సన్నివేశాలు ఉండనున్నాయని సమాచారం. ఇక ఈ చిత్రం మూడు భాగాలుగా రానుందనే వార్త కూడా సోషల్‌మీడియాలో తెగ షేర్‌ అవుతోంది. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రానప్పటికీ అభిమానులు మాత్రం ఈ అప్‌డేట్స్‌కు తెగ ఖుష్‌ అవుతున్నారు.

ఈ సినిమాపై మహేశ్‌ అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రియుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో మహేశ్‌ బాబు పాత్ర గురించి ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్‌ పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం తెలిసిందే. మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రీలీల, పూజా హెగ్డేలతో మహేష్‌ బాబు రొమాన్స్ చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రానుంది. అయితే రాజమౌళి సినిమా మాత్రం ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రారంభిస్తాడని అభిమానులు అనుకుంటున్నారు.